దేశంలో ఒమిక్రాన్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రులు సైతం కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చే దిశగా ఏ మాత్రం కదలికలు ఉన్నా ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అన్ని పరిస్థితులను ప్రభుత్వం అన్ని గమనిస్తోంది. దేన్నైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నాం. కరోనాకు సంబంధించి ఎలాంటి కదలికలు ఉన్నా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు.
ప్రతి మూమెంట్ ను తెలంగాణ సర్కార్ గమనిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగానికి, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం. కరోనా బాధితులకు చికిత్స కోసం మందులు, ఆస్పత్రులు అన్ని సిద్దంగా ఉంచాలని మెడికల్ సిబ్బందికి సైతం ఆదేశాలు జారీ చేశాం. ముఖ్యంగా ప్రజలు అందరూ మాస్కులు ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం కరోనా అంత సీరియస్ గా ఏమీ లేదు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అన్నింటిని ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Konijeti Rosaiah : వైఎస్‌ను కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?
పంటమార్పిడిపై కేంద్రం మీనమేషాలు..
యాసంగి పంట విషయాన్ని తేల్చాలని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోవటం లేదన్నారు. పార్లమెంట్ లో కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఉప్పుడు బియ్యాన్ని కొనేదిలేదని తేల్చిచెప్పేశారు. తెలంగాణలో పండే బియ్యాన్ని కేంద్రం కొనలేమని చెబుతున్న నేపథ్యంలో... రాష్ట్ర రైతులు ఆలోచించి పంటలు వేయాలన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వం యాసంగిలో కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోతోంది. కోనుగోలు కేంద్రాలు యాసంగిలో ఉండవని తేల్చి చెప్పారు. వడ్లు కొందామన్నా వాటిని ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. యాసంగిలో వేరే ఏ పంటలు వేయాలి. ఏం కొనుగోలు చేస్తారు అని కేంద్రాన్ని ప్రశ్నిస్తే ... మార్చిలో చెబుతామంటున్నారు. మరి మార్చిలో చెబితే... ఇప్పుడు ఏం పండించాలి, ఏం కొంటారు అని అడిగితే కేంద్రం అనిశ్చితిగా వ్యవహరిస్తోందని మంత్రి వేముల వివరించారు.
ప్రత్యామ్నయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం
ప్రత్యామ్నయ పంటల విషయంలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యామ్నయ పంటలపై పలు సూచనలు చేస్తున్నారని మంత్రి వేముల తెలిపారు. విత్తనాల కొరత లేకుండా చూస్తాం. మందులు అందుబాటులో ఉంచుతాం. 24 గంటల కరెంట్ ఇస్తాం. సాగుకు సరిపడా నీటిని ఇస్తామని చెప్పారు మంత్రి. అన్నదాతలకు ఏం చేయాలో అన్ని విధాలుగా చేసేందుకు సిఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు మంత్రి. కేంద్రం బియ్యం తీసుకోకుంటే.... రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనే పరిస్థితి ఉండదు కాబట్టి రైతులు అర్థం చేసుకోవాలి. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదని స్పష్టంగా చెప్పారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
Also Read: మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
Also Read: KCR About Rosaiah: పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి.. రోశయ్య మృతిపై కేసీఆర్, వైఎస్ జగన్ సంతాపం