తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగిలో రైతులు వరి పంట సాగు చేయవద్దని స్పష్టం చేసింది. ఇతర పంటల వైపు వెళ్లాలని అన్నదాతలకు సూచనలు చేస్తోంది. సరే మరి నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లుల పరిస్థితేంటన్నదానిపై యాజమాన్యాలు తలపట్టుకుంటున్నాయ్. జిల్లాలోని బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యాజమాన్యాలది ఎటూ తెేల్చుకోలేని పరిస్థితి. ఎఫ్‌సీఐ బాయిల్డ్‌ రైస్‌ కొనబోమంటున్ననేపథ్యంలో రైతులు ధాన్యం సాగుకు దూరంగా ఉండటాలని ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో మిల్లు యజమానులు ఆందోళన చెందుతున్నారు. 


మరి రైస్ మిల్లుల కూలీల గతేంటీ ?


నిజామాబాద్ జిల్లాలో వరి అధిక విస్తీర్ణంలో పండిస్తారు. దీంతో జిల్లాలో వందల రైస్ మిల్లులు నడుస్తున్నాయ్. మరి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో బాయిల్డ్ రైస్ మిల్లుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. మిల్లులనే నమ్ముకుని ఉపాధి పొందుతున్న రైతుల గతేంటీ. వారు రోడ్డు మీద పడే అవకాశం లేకపోలేదు. జిల్లాలోని రైస్ మిల్లుల్లో దాదాపు 8 వేలకుపైగా కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఖరీఫ్, రబీ సీజన్‌లలో లక్షలాది మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి లెవిగా ఈ రైస్‌ మిల్లులు అందిస్తున్నారు. వరిసాగు తగ్గితే పలు మిల్లులు మూతపడే అవకాశం ఉండగా... గతంలోలాగానే నేరుగా ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లానే డిమాండ్‌ ఉన్న రకాలను కొనుగోలు చేసి మిల్లులను యథావిధిగా కొనసాగించేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.


రైస్ మిల్లులపైనే ఆధారం


జిల్లాలో దాదాపు 300లకు పైగా రైస్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో 250 వరకు రా రైస్‌ మిల్లులు ఉండగా 70 వరకు బాయిల్డ్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో 2టన్నుల నుంచి 8 టన్నుల వరకు ఉన్న రైస్‌ మిల్లులు ఉన్నాయి. ఒక్కో మిల్లుపైన 6 నుంచి 10 కోట్ల వరకు ఖర్చు చేసి ఏర్పాట్లు చేశారు.  మొదట 10లోపు ఉన్న ఈ రైస్‌ మిల్లులు 300 లకు పైగా ఏర్పడ్డాయ్. ఈ మిల్లుల పరిధిలో ప్రతిసీజన్‌లో వెయ్యి కోట్లకు పైగా ధాన్యాన్ని తీసుకుంటున్నారు. బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి లేవిగా అందిస్తున్నారు. రెండుసీజన్‌లలో దాదాపు 2వేల కోట్ల వరకు మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వమే మార్చి ఎఫ్‌సీఐకి లేవిగా అందిస్తున్నారు. 2 సీజన్‌లలో సుమారు 2వేల కోట్ల వరకు ఈ మిల్లులల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు కేటాయిస్తుండగా గతంలో మాత్రం నేరుగా మిల్లర్‌లే బహిరంగ మార్కెట్‌లో ధాన్యాన్ని కొనుగోలు చేసి నడిపించేవారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం 2010 నుంచి ధాన్యం కొనుగోళ్లను చేస్తున్నారు. 


జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగు


ప్రస్తుతం రెండు సీజన్‌లలో జిల్లాలో 4లక్షల ఎకరాలకుపైగా వరిసాగవుతోంది. 2 సీజన్‌లలో కలిపి దాదాపు 17లక్షల మెట్రిక్‌టన్నుల వరకు ధాన్యం వస్తుంది. ధాన్యం దిగుబడి ఎక్కువకావడం వల్ల 2 సీజన్‌లు కలిపి 11 నెలలపాటు మిల్లులు నడుస్తున్నాయి. మిల్లులు మూతపడితే రైతులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. జిల్లాలో మిల్లులు ఉండడం వల్ల ధాన్యానికి డిమాండ్‌ ఉంటుంది. ప్రభుత్వం కొనుగోలు చేయకున్నా మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వరిసాగు ఆగితే మిల్లులు ఒక సీజన్‌లో పూర్తిగా మూతపడతాయ్. వీటిపైనే ఆధారపడిన కార్మికులకు ఉపాధి కోల్పోయే పరిస్థితి  నెలకొంది.


జిల్లాలోని రైస్‌ మిల్లర్లకు గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఇక్కడ వరిసాగు చేస్తేనే రైస్ మిల్లులు నడుస్తాయ్. ఇక ప్రత్యామ్నయం చూసుకోవాలంటే ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులు నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగైతే రైస్ మిల్లర్లకు ఖర్చు అధికమవుతుంది. వారికి రవాణ ఖర్చులు ఎక్కువవుతాయ్. వేరే ప్రాంతాల్లోకి వెళ్లి కొంటే ధరల్లో వ్యత్యాసం కూడా ఏర్పడుతుందని రైస్ మిల్లర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయని సమయంలో రైస్ మిల్లర్లు నేరుగా రైతుల వద్దే కొనేవారు. ప్రస్తుతం యాసంగిలో వరిసాగే జరగకుంటే తమ పరిస్థితేంటన్నదానిపై మిల్లర్లు అయోమయంలో ఉన్నారు. 


Also Read: శిల్పాచౌదరి ట్రాప్ లో పడ్డ యువ హీరో... రూ.3 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి