Gold Silver Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వరుసగా మూడో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధర పతనమైంది. మరోవైపు వెండి ధర భారీగా పడిపోయింది.  తాజాగా 22 క్యారెట్లపై రూ.250 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.44,900 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,990 కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.800 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,500కి పడిపోయింది.


ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.270 మేర తగ్గింది. ఇక్కడ సైతం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,260 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,900కు పతనమైంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,270 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 కు దిగొచ్చింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మార్కెట్లోనూ కేజీ ధర రూ.800 మేర పతనం కావడంతో వెండి ధర రూ.65,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు దిగొచ్చియి. బంగారం ధరలు నేడు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో బంగారం రూ.280 మేర తగ్గడంతో ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,050 అయింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,320కి పతనమైంది. చెన్నైలో రూ.270 మేర తగ్గడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,120 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,020 అయింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,760 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,760 కి పతనమైంది.


తగ్గిన ప్లాటినం ధర
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు రూ.20 మేర తగ్గింది. ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.22,990 అయింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,110 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,980 అయింది.


పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Bank Holidays January 2022: జనవరిలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే ఇబ్బంది ఉండదు
Also Read: RBI Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆన్‌లైన్‌ పేమెంట్‌ నిబంధన గడువులో మార్పు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే? 
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి