31 డిసెంబర్ 2021 రాశిఫలాలు


మేషం
ఈరోజంతా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ అంతిమంగా పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శత్రువులపై పైచేయి సాధిస్తారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. మానసిక ప్రశాంతత కోసం  యోగా, వ్యాయామం ప్రారంభించండి.
వృషభం
ఈరోజు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వ్యాపారులు కొత్త ప్రణాళికను ప్రారంభించవచ్చు.  మీరు పని చేసే స్థలంలో ఎవరితోనూ వివాదాలు పెట్టుకోకండి.  బంధువులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. రిస్క్ తీసుకోకండి. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. పిల్లల విషయంలో జాగ్రత్త.
మిథునం
ఎప్పటి నుంచో చేతికందాల్సిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం హోదా దక్కుతుంది. పాతస్నేహితులను కలుస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  ప్రయాణాలకు అనుకూల సమయం.  తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి


Also Read: నక్షత్రం ప్రకారం వచ్చే అక్షరంతో పేరు పెట్టకపోతే ఏం జరుగుతుంది..
కర్కాటకం
ఈరోజు మీరు చాలా మంచి రోజు. మీ పనితీరులో చిన్నపాటి మార్పులు చేసుకుంటే అందరితో ప్రశంసలు అందుకుంటారు.  అనవసరమైన ఖర్చులు ఉండొచ్చు. మీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోండి. ఆఫీసులో సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబంతో  సంతోషంగా గడుపుతారు.
సింహం
ఏదో చిన్న సమస్య వెంటాడుతుంది.  వ్యాపారం బాగానే ఉంటుంది. కుటుంబానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యసనాలకు దూరంగా ఉండండి. మిత్రులను కలుస్తారు.
కన్య
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీ అంకితభావంతో డబ్బు సంపాదిస్తారు.అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈరోజంతా చురుకుగా ఉంటారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీరు ఒకేసారి చాలా పనులు చేస్తారు. కొన్ని పనులపై  ప్రయాణం చేయవచ్చు. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి.


Also Read: అడుగు అడుగులోనూ తన్మయత్వమే.. జీవితంలో ఒక్కసారైనా ఈ వనయాత్ర చేస్తే చాలంటారు..
తుల
మీరు ఒత్తిడికి లోనవుతారు. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఆర్థిక పరిస్థితిపై ఆందోళన ఉంటుంది. ప్రయాణం చేయవచ్చు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్త వహించండి. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. ప్రస్తుతానికి పెట్టుబడి పెట్టొద్దు. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
వృశ్చికం
వైవాహిక జీవితం బావుంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు. మీరు కొత్త పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.  రిస్క్ తీసుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
ధనస్సు
ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.  పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు.  విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. రిస్క్ తీసుకోకండి. పెద్దల ఆశీస్సులు తీసుకోండి.


Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
మకరం
మీ రోజంతా బిజీగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు రావొచ్చు. వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన రోజు.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు స్నేహితులను కలుసుకోవచ్చు. విద్యార్థులకు కొత్త సమాచారం అందుతుంది.
కుంభం
ఇది మీకు అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మీరు కొత్త పనులు చేయొచ్చు. రోజంతా సానుకూలంగా ఉంటారు. మానసికంగా సంతోషంగా ఉంటారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఆగిపోయిన ధనం అందుతుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.
మీనం
వ్యాపారులకు ఈరోజు ఆర్థిక లాభం తక్కువగా ఉంటుంది. ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు.  ఇంటి బాధ్యతలు పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడి పెట్టవద్దు.


Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి