తల్లిదండ్రులు కాబోతున్నాం అనే వార్త విన్నప్పటి నుంచి అమ్మాయి కావాలి, అబ్బాయి కావాలి అని చర్చలు నడుస్తాయ్. నెలలు నిండేకొద్దీ జరిగే మరో ముఖ్యమైన చర్చ పేరు గురించి. అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి…అబ్బాయి పుడితే ఏ పేరు పెట్టాలి అని. అమ్మదో మాట,నాన్నతో మాట, అమ్మమ్మ, బామ్మ…తాతయ్యలది మరోమాట. అన్నీ కలిపితే పెద్ద లిస్టే తయారువుతుంది. పేరు నిర్ణయించేవరకూ పెద్ద డిస్కషనే నడుస్తుంది. అయితే ఫలానా నక్షత్రంలో పుట్టిన వారికి ఈ అక్షరంతో పేరు పెట్టాలని తెలిసినప్పటి నుంచీ మరో చర్చ జరుగుతుంది. అయితే చాలామంది నక్షత్రంతో సంబంధం లేకుండా నచ్చిన పేరు పెట్టుకుంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. మీ నక్షత్రం తెలుసుకునేందుకు రెండు పద్ధతులుంటాయి.
1.జన్మ నక్షత్రం- జన్మ నక్షత్రం అంటే పుట్టిన సమయాన్ని బట్టి నక్షత్రం తెలుసుకోవడం.
2. నామ నక్షత్రం- మీ పేరులో ఉండే మొదటి అక్షరం ఆధారంగా నక్షత్రం తెలుసుకోవడం.
ఎలా తెలుసుకున్నా ఒకటే ఫలితం. కానీ ఇప్పటికీ నక్షత్రం ప్రకారం పేర్లు పెట్టకపోతే ఏదో జరిగిపోతుందనే మూఢవిశ్వాసం చాలామందిలో ఉంది. వీటికి తోడు పేరు సరిసంఖ్యలో ఉండాలని…బేసి సంఖ్యలో ఉండాలనే చర్చలూ జరుగుతున్నాయ్. కానీ ఇదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు పండితులు. ఆరోజు ఉన్న నక్షత్రానికి సంబంధించిన అక్షరంతో పేరు పెట్టొచ్చు, లేదా వేరే పేరు నిర్ణయించుకోవచ్చు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
పూర్వీకులు ఈ విధానం ఎందుకు ఫాలో అయ్యేవారు
మన పూర్వీకులంతా నక్షత్రం ప్రకారమే పేర్లు పెట్టేవారు కదా ఇప్పుడేంటి కొత్తగా అంటారా.. దానికి సమాధానం ఏంటంటే... అప్పట్లో అందరకీ నక్షత్రాలు, రాశులు,ముహూర్తాలపై అంత అవగాహన లేదు. శుభకార్యమైనా, అశుభమైనా తమకు తెలిసిన బ్రాహ్మణుడి వద్దకెళ్లి మంచి చెడులు అడిగేవారు. వాస్తవానికి ఏ ముహూర్తం పెట్టాలన్నా తిథి కన్నా నక్షత్రమే ప్రధానం. అలాంటప్పుడు మీ పిల్లల నక్షత్రాలేంటని అడిగితే అప్పట్లో తెలిసేది కాదు. మహా అయితే సంక్రాంతి కి ముందు రోజు పుట్టారనో…ఫలానా తుపాను వచ్చినప్పుడు పుట్టారనో…ఇలా బండ గుర్తులు చెప్పగలరంతే. అలాంటప్పుడు వాళ్ల నక్షత్రం తెలుసుకుని ముహూర్తం నిర్ణయించడం సాధ్యమేనా అంటే అస్సలు కాదు. అందుకనే అప్పట్లో వాళ్లు పుట్టిన నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టేవారు. అలాంటప్పుడు పండితుడికి ఆయా వ్యక్తుల పేర్లు చెప్పినప్పుడు…ఆ మొదటి అక్షరం ఆధారంగా వారి నక్షత్రం ఏంటో గ్రహించి ముహూర్తం నిర్ణయించేవారు. ముఖ్యంగా పెళ్లి సంబంధం కుదిరేటప్పుడు గణాలు లెక్కపెట్టాలన్నా…ముహూర్తం నిర్ణయించాలన్నా నక్షత్రమే ప్రధానం.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
ఇప్పుడెందుకు ఫాలో అవాల్సిన అవసరం లేదు
గతంతో పోల్చకుంటే ఇప్పుడు అందరికీ ఈ విషయాలపై ఆసక్తి పెరిగింది. పుట్టిన వెంటనే డేట్, టైమ్ నోట్ చేసుకుంటున్నారు. నక్షత్రం ఏంటో తెలుసుకుంటున్నారు. చక్రాలు వేయించేస్తున్నారు, జాతకాలు రాయించేస్తున్నారు. అంతెందుకు సాధారణ ప్రసవాలని కాలం చెల్లిన ఈ రోజుల్లో ముహూర్తం, నక్షత్రం నిర్ణయించుకున్నాకే బిడ్డను కంటున్నారు. అది మొదలు ప్రతి చిన్న కార్యక్రమానికి మంచిరోజు చూసుకుంటున్నారు. ఇంత అవగాహన ఉన్నప్పుడు నచ్చిన పేరు పెట్టుకోక…నక్షత్రాన్ని తెలియజేసి పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది?. అందుకే మీ పిల్లలకి ఫలానా అక్షరంతోనే పేరు పెట్టాలనే ఆలోచన వదిలేసి...మీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
పేరుని బట్టి జీవితం ఉండదు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకున్నాక పేరు మారుమోగుతుంది కానీ…మీ పేరు వల్ల మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడం జరగదు. మహారాజు అని పేరు పెట్టినంత మాత్రాన మహారాజు కాలేడు. బంటు అని పేరు పెట్టినంత మాత్రాన సైనికుడిగానే మిగిలిపోడు. అందుకే తెలిసీ తెలియకుండా అనుసరించడం కాదు.. ఎందుకు ఏంటి అని ఆలోచించాలంటారు. ముఖ్యవిషయం ఏంటంటే..పిల్లల జన్మ నక్షత్రం ఏంటో మీరు రాయించుకున్నప్పుడు, గుర్తుపెట్టుకోగలిగినప్పుడు ఎలాంటి సందేహాలు లేకుండా ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అవన్నీ గుర్తుండవు అనుకుంటే నక్షత్రానికి సంబంధించిన అక్షరంతోనే పేరు పెట్టేసుకోండి.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి