కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఇయర్‌ ఎండింగ్ వచ్చిందంటే చాలు రానున్న ఏడాదిలో ఎన్ని సెలవులు ఉంటాయో తెలుసుకొనేందుకు ప్రజలు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఆర్థిక ప్రణాళికలు వేసుకోవాలంటే బ్యాంకులకు  ఎన్ని సెలవులు వస్తున్నాయో తెలుసుకోవడం ముఖ్యం. 2022, జనవరిలో బ్యాంకులకు 16 రోజులు సెలవులు వస్తున్నాయి. 


ఇందులో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలూ ఉన్నాయి. ఇవి కాకుండా దేశంలోని ఆయా ప్రాంతాల్లో పండుగలను బట్టి మిగతా సెలవులు ఇస్తారు. జనవరి 26న దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవన్న సంగతి తెలిసిందే. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌, ఆర్‌టీజీస్‌, బ్యాంక్స్‌ క్లోజింగ్‌ అకౌంట్ల వారీగా ఆర్‌బీఐ సెలవులు ఇస్తారు.


2022, జనవరిలో సెలవులు


01 January 2022: కొత్త సంవత్సరం తొలి రోజు


03 January 2022: కొత్త సంవత్సరం వేడుకలు, లూసంగ్‌


04 January 2022: లూసంగ్‌


11 January 2022: మిషనరీ డే


12 January 2022: స్వామి వివేకానంద జయంతి


14 January 2022: మకర సంక్రాంత్రి


15 January 2022: ఉత్తరాయన పుణ్యకాల సంక్రాంత్రి, కనుమ


18 January 2022: తై పూసమ్‌


26 January 2022: గణతంత్ర దినోత్సవం


2022, జనవరిలో వారాంతపు సెలవులు


02 January 2022: ఆదివారం


08 January 2022: రెండో శనివారం


09 January 2022: ఆదివారం


16 January 2022: ఆదివారం


22 January 2022: నాలుగో శనివారం


23 January 2022: ఆదివారం


30 January 2022: ఆదివారం


జనవరి మొదటి రోజున ఐజ్వాల్‌, చెన్నై, గ్యాంగ్‌టక్‌, షిల్లాంగ్‌లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. ఈశాన్య భారత దేశంలో లూసంగ్‌ వేడుకలు జరుగుతాయి. మిషనరీ డే, వివేకానంద జయంతి సందర్భంగా ఈశాన్య భారతం, కోల్‌కతాలో సెలవులు ఉన్నాయి. మకర సంక్రాంతి సమయంలో అహ్మదాబాద్‌, చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, గ్యాంగ్‌టక్‌ సహా దక్షిణ భారతదేశమంతా సెలవులు ఉన్నాయి.


Also Read: RBI Tokenisation Deadline: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ఆన్‌లైన్‌ పేమెంట్‌ నిబంధన గడువులో మార్పు.. ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే?


Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!


Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


Also Read: Cyber Crime: మీ మొబైల్‌ ఫోన్‌ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి


Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి