సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల ఏపీలో పర్యటించారు. సీజేఐ నియమితులైన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన తనపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం జగన్, రాష్ట్ర ప్రజలు చూపిన ప్రేమాభిమానాలపై సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సజావుగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం, మంత్రులకు, అధికారులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. 


Also Read:  రాజ్ భవన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు... హాజరైన సీఎం జగన్ దంపతులు


తెలుగు ప్రజల ఆశీర్వాదం బలమే


తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏపీ పర్యటన అనంతరం ఆయన బహిరంగ లేఖ రాశారు. సమయం లేకపోవడంతో చాలా మందిని కలవలేకపోయానని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని జస్టిస్‌ రమణ అన్నారు.  తన స్వగ్రామం పొన్నవరానికి వెళ్లాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు అది సాధ్యమైందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు శీతాకాలపు సెలవులు కారణంగా రాష్ట్ర పర్యటనకు అవకాశం కలిగిందన్నారు. ఏపీలో అడుగు పెట్టినప్పటి నుంచీ ప్రజలు ఎంతో అభిమానంగా చూసుకున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పొన్నవరం పొలిమేరల నుంచి ఊరేగింపుతో తీసుకెళ్లిన ఘటనను ఎన్నడూ మరిచిపోనని సీజేఐ అన్నారు. 


Also Read: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా ఆహ్వానించిన సీఎం జగన్ ! 


కుటుంబంతో స్వగ్రామానికి రావడం ఎంతో ఆనందం


తన కుంటుంబానికి మరోసారి తన స్వగ్రామాన్ని చూపించగలగడం ఎంతో ఆనందంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఎంతో మంది ఆప్తులను ఈ పర్యటనలో కలుసుకున్నానని, ఎన్నో రంగాలకు చెందిన వారు పలకరించేందుకు వచ్చారన్నారు. బెజవాడ బార్‌ అసోసియేషన్, ఏపీ హైకోర్టు బార్‌ అసోసియేషన్, ఏపీ బార్‌ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ విజయవాడ అతితక్కువ కాలంలో అసాధారణ ఏర్పాట్లతో సత్కారాలతో ముంచెత్తారని గుర్తుచేశారు. ఈ పర్యటనలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రోటోకాల్‌ సిబ్బంది, పోలీసులు, రాజ్‌భవన్‌ సిబ్బంది, అధికార యంత్రాంగానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు. 


Also Read:  నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ? 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి