క్రిప్టో కరెన్సీ ధరలు మంగళవారం పెరిగాయి. ఇన్వెస్టర్లు ఎక్కువగా కొనుగోళ్లు చేపట్టారు. బిట్‌కాయిన్‌ 2.41 శాతం పెరిగి రూ.52,90,543 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దాని మార్కెట్‌ విలువ ఏకంగా రూ.92 ట్రిలియన్లుగా ఉంది. ఎథిరెమ్‌ 0.53 శాతం పెరిగి రూ.3,83,635 వద్ద ఉంది. టెథెర్‌ (యూఎస్‌డీటీ) 0.79 శాతం తగ్గి రూ.79.91, రిపిల్‌ (ఎక్స్‌ఆర్‌పీ) 1.74 శాతం తగ్గి రూ.101.75 వద్ద కొనసాగుతున్నాయి. కర్డానో (ఏడీఏ) 6.13శాతం పెరిగి రూ.174.97, పొల్కాడాట్‌ (డీఓటీ) 0.06 శాతం తగ్గి రూ.4229, డోజీకాయిన్‌ (డీవోజీఈ) 3.90 శాతం పెరిగి రూ.22.77 వద్ద ఉన్నాయి.


హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.


క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.






భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.


Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌


Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు


Also Read: FD High Interest Rate: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా? ఈ బ్యాంకుల్లో 7 శాతం వడ్డీ ఇస్తున్నారు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి