క్రిప్టో కరెన్సీ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది! నియమాలను ఉల్లంఘించే కఠిన చర్యలు తీసుకోనుంది. కొత్తగా తీసుకొస్తున్న చట్టంలో నియమాలను పొందుపరిచిందని తెలుస్తోంది. అక్రమాలకు పాల్పడే వారిని వారెంట్‌ లేకుండా అరెస్టు చేస్తారని, బెయిల్‌  లేకుండా జైల్లోంచే ఉంచేస్తారని సమాచారం.


ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనున్న సంగతి తెలిసిందే. శీతకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు చర్చించిన తర్వాత ఆమోదించనున్నారు.


మొదట క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని సమాచారం రావడంతో స్టేక్‌హోల్డర్లంతా తమ పెట్టుబడులను నష్టాలతోనే ఉపసంహరించేందుకు పూనుకున్నారు. కొందరు నష్టపోయారు. అయితే వర్చువల్‌ కరెన్సీని నిషేధించడం లేదని తర్వాత వార్తలు వచ్చాయి. 'క్రిప్టో కరెన్సీ'లో కరెన్సీ అనే పదాన్ని తొలగిస్తున్నారు. క్రిప్టో అసెట్‌గా మాత్రమే ట్రేడింగ్‌ చేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు! ఎట్టిపరిస్థితుల్లోను కరెన్సీగా, లావాదేవీలకు వాడుకోనివ్వరు.


క్రిప్టో కరెన్సీపై తేబోతున్న బిల్లులోని నిబంధనలను వ్యక్తులు, కార్పొరేషన్లు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు. వారికి రూ.20 కోట్లు జరిమానా విధిస్తారు. ఏడదిన్నర కాలం జైలు శిక్ష విధిస్తారు. ప్రైవేటు క్రిప్టో లావాదేవీలను నిషేధించడమే కాకుండా ట్రేడింగ్‌ను నియంత్రించనున్నారు. వ్యక్తులు క్రిప్టో మైనింగ్‌, జనరేటింగ్‌, హోల్డింగ్‌, సెల్లింగ్‌, డీలింగ్‌ను నగదు మార్పిడి కింద వినియోగించినా, భద్రపరిచినా జైలు శిక్ష తప్పదు. వారెంటు లేకుండా ఊచలు లెక్కపెట్టిస్తారు. ఊహాతీతమైన క్రిప్టో ప్రకటనల పైనా చర్యలు తీసుకొంటారని తెలుస్తోంది.


Also Read: Hardik Pandya Test Retirement: హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు యోచనలో ఆల్‌రౌండర్‌!


Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?


Also Read: Income Tax Filing: 31 చివరి తేదీ..! ఐటీఆర్‌ ఆలస్యమైతే పెనాల్టీ తప్పదు..! ఇలా చేయండి..!


Also Read: Forbes Most Powerful Women: అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో 'భారతీయం'.. నిర్మలా, కమలా హారిస్‌కు చోటు


Also Read: Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?


Also Read: Indian Mobile Congress 2021: మెరుపు వేగంతో దేశంలో 5Gని ప్రవేశపెట్టాలన్న ముకేశ్ అంబానీ


Also Read: Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి