భారత్‌లో వేగంగా 5జీ నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ అన్నారు. అందరికీ అందుబాటు ధరలో ఈ సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో 2జీ నుంచి 4జీ, 5జీకి మైగ్రేషన్‌ వేగంగా పూర్తిచేయాలని సూచించారు. 'ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2021'లో ఆయన మాట్లాడారు.


'అత్యంత ప్రాధాన్యం ఇచ్చి దేశంలో 5జీని ప్రవేశపెట్టాలి. జియోలో మేం 4జీ, 5జీ, బ్రాండ్‌బ్యాండ్‌ మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి సారించాం. దేశంలోనే అభివృద్ధి చేసిన 5జీ పరిష్కారాలను ఉపయోగిస్తున్నాం. ఇది క్లౌడ్‌ నేటివ్‌, డిజిటల్‌ విధానంలో పనిచేస్తుంది. మేం జియో నెట్‌వర్క్‌ను 4జీ నుంచి 5జీకి అప్‌గ్రేడ్‌ చేశాం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన భారతీయులను డిజిటల్‌ విప్లవంలో భాగం చేయాలి' అని ముకేశ్‌ అన్నారు.


తక్కువ ధరకే ఇంటర్నెట్‌, డేటాను అందించడంపై తాము దృష్టిపెట్టామని ముకేశ్ అంబానీ తెలిపారు. 'భారత్‌లో మొబైల్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెంచాలంటే అందుబాటు ధరలోనే సేవలను అందించడాన్ని మర్చిపోవద్దు. దేశం డిజిటల్‌ సమ్మిళత అభివృద్ధి వైపు అడుగులు వేయాలి. ఒక మిషన్‌లాగా దేశవ్యాప్తంగా ఫైబర్‌ అనుసంధానాన్ని పూర్తి చేయాలి' అని ఆయన వివరించారు.


ఫైబర్‌ ద్వారా పూర్తి స్థాయిలో అపరిమితంగా డేటాను అందించొచ్చని అంబానీ తెలిపారు. అందుకే భారత్‌ను ఫైబర్‌ రెడీ చేయాలని సూచించారు. కొవిడ్‌ సమయంలో జియో ఫైబర్‌ను 50 లక్షల ఇళ్లకు పరిచయం చేశామని వెల్లడించారు. ఈ సదస్సులో ముకేశ్‌ అంబానీతో పాటు రైల్వే, కమ్యూనికేషన్ల మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌, ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, ఎంపీ దేవ్‌సిన్హ చౌహాన్‌, టెలికాం కార్యదర్శి కే రాజారమన్‌, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునిల్‌ భారతీ మిత్తల్‌, ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమారం మంగళం బిర్లా తదితరులు పాల్గొన్నారు.


Also Read: IPOs This Week: డబ్బుల వర్షమే..! ఈ వారం ఐపీవోకు 4 కంపెనీలు ..! వివరాలు ఇవే


Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్‌ చేసుకోండి!


Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్‌, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్‌ ఉన్నాయంటే!


Also Read: Corporate FD Rates: బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ వస్తున్న ఎఫ్‌డీలివి! కాస్త ఎక్కువ రాబడే..!


Also Read: RBI Monetary Policy: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి


Also Read: 2000 Note : రూ. 2 వేల నోటు త్వరలోనే కనుమరుగు ! ఎవరికీ తెలియకుండానే కేంద్రం ఉపసంహరించుకుంటోందా ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి