పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తోన్న 'భీమ్లానాయక్' సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని అందరికంటే ముందుగానే స్లాట్ బుక్ చేసింది టీమ్. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చి కొన్ని నెలలు దాటేసింది. కానీ ఇప్పుడు ఈ సినిమా పండక్కి రావడం ఇండస్ట్రీలో చాలా మందిని ఇబ్బంది పెడుతోంది. రాజమౌళి డైరెక్ట్ చేసిన 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఎప్పుడైతే జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారో.. అప్పటివరకు సంక్రాంతి రేసులో ఉన్న మహేష్ సినిమా తప్పుకుంది. కానీ పవన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. 


సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా సంక్రాంతి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఎప్పటికప్పుడు ఈ ప్రచారాన్ని చిత్రబృందం ఖండిస్తూనే ఉంది. అయినప్పటికీ కొందరు కావాలనే 'భీమ్లానాయక్'ను టార్గెట్ చేసి సినిమా సంక్రాంతికి రావడం లేదని చెబుతున్నారు. నిన్న కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. వెంటనే నిర్మాత నాగవంశీ స్పందిస్తూ.. జనవరి 12న తమ సినిమా రావడం పక్కా అని మరోసారి చెప్పారు. 


నిజానికి ఈ సినిమాను సంక్రాంతి రేసు నుంచి తప్పించడానికి చాలా రోజులుగా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు ప్రయత్నిస్తున్నారు. దిల్ రాజు కూడా సినిమాను వాయిదా వేయమని అడుగుతున్నారు. రాజమౌళి స్వయంగా పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఆ మీటింగ్ జరగలేదు. 'ఆర్ఆర్ఆర్' సినిమా మీద బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టారని.. 'భీమ్లానాయక్' కూడా తమ సినిమాతో పాటు విడుదలైతే థియేటర్లు షేర్ చేసుకోవాల్సి వస్తుందనేది 'ఆర్ఆర్ఆర్' నిర్మాతల ఆవేదన. 


అయితే ఈ విషయంలో ఒక్క 'భీమ్లానాయక్'ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సంక్రాంతికి మరో పెద్ద సినిమా 'రాధేశ్యామ్' కూడా ఉంది. కానీ దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. అది పాన్ ఇండియా సినిమా అని.. రిలీజ్ డేట్ మార్చడం కష్టమని వివరణ ఇస్తున్నారు. మరోపక్క 'భీమ్లానాయక్' సినిమా రేసు నుంచి తప్పుకుంటే నాగార్జున తన 'బంగార్రాజు'ని విడుదల చేయాలని చూస్తున్నాడు. 


నిర్మాత సుప్రియ ఈ విషయాన్ని నేరుగా మీడియాతోనే చెప్పారు. సంక్రాంతి బరి నుంచి ఏదైనా సినిమా తప్పుకుంటే తమ సినిమా రావడం ఖాయమని అన్నారు. అంటే 'బంగార్రాజు విషయంలో కూడా ఎవరికీ అభ్యంతరాలు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నాగార్జున సినిమాకైతే థియేటర్లు షేర్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ పవన్ సినిమా అనేసరికి మాత్రం వాయిదా వేయాలని అడుగుతున్నారు. ఈ విషయంలో పవన్ నిర్మాతలతో పాటు.. ఫ్యాన్స్ కూడా బాగా హర్ట్ అవుతున్నారు. కావాలనే తమ హీరోని టార్గెట్ చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..


Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్


Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?


Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?


Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి