‘బిగ్ బాస్’ బ్యూటీ అషూ రెడ్డి గురించి మీకు తెలిసిందే. ఒకప్పుడు సమంత పోలికలతో ‘టిక్ టాక్’లో పాపులారిటీ సంపాదించిన ఈ భామ ఇప్పుడు పలు టీవీ చానెళ్లలో యాంకరింగ్ చేయడంతోపాటు ‘కామెడీ స్టార్స్’లో సైతం కనిపిస్తోంది. ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఆమె.. ‘బిగ్ బాస్’ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 


అషూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన ఫొటోలను పోస్ట్ చేయడమే కాకుండా.. యూట్యూబ్ వీడియోలతోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె ఓ షాకింగ్ విషయం వెల్లడించింది. ఇదంతా ఆమె కెమేరాలో రికార్డు చేసింది. సోఫాలో కూర్చొని ఏడుస్తున్న అషూ రెడ్డిని ఏమైందని తల్లి ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆమె అషూ స్పందిస్తూ.. ‘‘నాకు పిరియడ్స్ రాలేదని టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్’’ అని వచ్చిందని చెప్పింది. అయితే, మొదట్లో ఈ విషయాన్ని ఆమె తల్లి, ఫ్రెండ్స్ నమ్మలేదు. జోక్ చేస్తోందని అనుకున్నారు. తల్లి మాత్రం కాసేపు మౌనంగా ఉండిపోయింది. 


Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం


అనంతరం అషూ ఏడ్చేయడం చూసి అంతా నమ్మేశారు. అషూ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏం చేయమంటావు అమ్మా’’ అని అడిగింది. దీంతో ఆమె ‘‘నాన్నకు చెప్పు అంది. ఏదైనా తాగి చద్దాం. నీన్ను ఇలా పెంచినందుకు నన్నే అంటారు’’ అని తెలిపింది. ఇలా కాసేపు వారి ఇంట్లోవారితో చర్చ జరిగింది. ఆ తర్వాత కోపంతో తల్లి ఆమెను కొట్టింది. కాలితో కూడా తన్నింది. ‘‘అమెరికా వెళ్లి జాబ్ చేసుకోమన్నా కదా’’ అంటూ తిట్టింది. ‘‘నీ పని ఇలా కాదు.. ఈ విషయాన్ని డాడీకి చెబుతా’’ అంటూ అక్కడి నుంచి ఫోన్ తెచ్చి కాల్ చేసింది. దీంతో అషూ.. తన తల్లి కాళ్లు పట్టుకుని నాన్నకు ఫోన్ చేయొద్దని చెప్పింది’’. తన ఫ్రెండ్స్ కూడా ఆమెను కాల్ చేయొద్దని అడిగారు. ఇది సరదాగా చేసిన ప్రాంక్ వీడియో అని, నిజం కాదని చెప్పారు. ఆ తర్వాత రూమ్‌లో పెట్టిన కెమేరాలను చూపించారు. దీంతో మరింత కోపం వచ్చింది. ‘‘నీకు ప్రాంక్‌లా ఉంది. నాకు హార్ట్ ఎటాక్‌లా ఉంది. ఇలాంటి విషయాలను జోక్ చేస్తారా?’’ అంటూ మరో రెండు దెబ్బలు తగిలించింది. ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి