ఈరోజు ఎపిసోడ్ లో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ కి రోల్ ప్లే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా  కంటెస్టెంట్స్ వేరే సభ్యుల్లా నటించాల్సి ఉంటుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మానస్-ప్రియాంక ల ప్రయాణాన్ని స్కిట్ గా చేయమని చెప్పారు. సన్నీ.. ప్రియాంక గెటప్ వేస్తానని చెప్పగా.. వెంటనే కాజల్.. మానస్ క్యారెక్టర్ తీసుకుంది. సన్నీకి లంగావోణీ కట్టి, విగ్గు పెట్టి, లిప్స్టిక్ రాసి ప్రియాంక రేంజ్ లో కాకపోయినా.. మోస్తరుగా రెడీ చేశారు. సన్నీను ఆ గెటప్ చూసిన హౌస్ మేట్స్ అంతా తెగ నవ్వుకున్నారు. 


ఇదేంట్రా ఇలా ఉందని షణ్ముఖ్ అనగా.. సన్నీ అతడి మీదకు వెళ్లాడు. కొంచెం ప్రిపేర్ అవ్వనీ అంటూ నవ్వుతూ అన్నాడు షణ్ముఖ్. ఇక మానస్ గెటప్ లో ఉన్న కాజల్ వెనక తిరుగుతూనే ఉన్నాడు సన్నీ. ఆ తరువాత 'మానస్ ఇప్పుడు ఐలవ్యూ పింకీ అని వంద సార్లు చెప్తాడు' అని డైలాగ్ వేసింది కాజల్. దానికి మానస్ సీరియస్ అయ్యాడు. 


'మీరు గబ్బు చేశారంటే మాత్రం మంచిగా ఉండదు ముందే చెప్తున్నా' అని వార్నింగ్ ఇచ్చాడు మానస్. 'ఎట్లా వస్తే అట్లా వస్తాది రా బయ్ ఆగు' అని సన్నీ డైలాగ్ కొట్టగా.. 'ఎంటర్టైనింగ్ గా చేయాలిరా' అని కాజల్ అంది. దానికి మానస్ 'ఎంటర్టైనింగ్ గా చెయ్.. నువ్ ఏందీ వంద సార్లు ఐలవ్యూ.. ఎవడు చెప్పిండు ఐలవ్యూ' అని సీరియస్ అయ్యాడు. దీంతో సన్నీ, కాజల్ అతడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం సీరియస్ గానే తీసుకోవడంతో 'నేను మానస్ క్యారెక్టర్ చేయను' అంటూ ఏడ్చుకుంటూ.. కాజల్ అక్కడ నుంచి వెళ్లిపోయింది.