‘బిగ్ బాస్’ బ్యూటీ దీప్తి సునయన గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తన క్యూట్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్లో సెగలు రేపే దీపు బాయ్‌ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ కూడా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే వారం షన్ను టాప్ 5లోకి రావడమే కాకుండా టైటిల్ కోసం తలపడే చివరి ఇద్దరిలో ఒకడవుతాడనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇందుకు దీపు, షన్ను అభిమానులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. బిగ్ బాస్‌ను పక్కన పెడితే.. షన్ను, దీప్తిల వీడియో సాంగ్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా విడుదలైన ‘మలుపు’ వీడియో సాంగ్స్‌కు మంచి ఆధరణ లభిస్తోంది. మంగళవారం ఈ వీడియో సాంగ్ దర్శకుడు వినయ్ షణ్ముఖ్ ‘మలుపు’ Bloopers వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఎంతో ఎమోషనల్‌గా సాగే ‘మలుపు’ సాంగ్ కోసం వారు ఎంత కష్టపడ్డారనేది ఈ వీడియోలో చూడవచ్చు. షూటింగ్ మధ్యలో ఫన్ కూడా ఆస్వాదించవచ్చు.
షన్ను పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘మలుపు’ వీడియో సాంగ్‌కు ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పాటకు 2.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ‘మలుపు’ వీడియో సాంగ్‌లో ఉండే కథ ప్రకారం.. ఓ వైరస్ వల్ల హాస్పిటల్‌లో చేరిన కార్తిక్(షణ్ముఖ్).. మరో నాలుగు గంటల్లోనే చనిపోతాడని వైద్యులు చెప్పడం, ఇక అతడిని కలవడం సాధ్యం కాదని చెప్పడంతో అతడి ప్రియురాలు (దీప్తి).. కార్తిక్‌తో గడిపిన మధుర క్షణాలను తలచుకుంటుంది. హాస్పిటల్‌లోనే ఉండే.. అతడిని కలిసేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, కార్తిక్‌ను ఉంచిన గది లాక్ చేసి ఉండటంతో ఆమె లోనికి వెళ్లలేదు. మరి, ఆమె కార్తిక్‌ను కలుస్తుందా? అతడిని కలిసేందుకు ఆమె ఏం చేస్తుందనేది ఈ సాంగ్‌లోనే చూడాలి.
ఇక పాట విషయానికి వస్తే.. వినయ్ షణ్ముఖ్ చాలా చక్కగా ఈ వీడియో సాంగ్‌ను తెరకెక్కించాడు. మణికుమార్ ఈ పాటకు సంగీతాన్ని అందించడమే కాకుండా తానే స్వయంగా ఆలాపించాడు. అతడి గాత్రం చాలా అద్భుతంగా ఉంది. కిట్టు లిరిక్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా ఓ బుల్లి సినిమాను చూస్తున్న అనుభవం కలుగుతుంది. షణ్ముఖ్, దీప్తి సునయనాలు తమ పాత్రలో జీవించారనే చెప్పుకోవాలి. భావోద్వేగ సన్నీవేశాలతోపాటు కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. ఈ పాటను చూస్తే తప్పకుండా గుండె బరువెక్కుతుంది. వ్యూవర్స్ నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి