కియా తన కొత్త కారెన్స్ కారుకు సంబంధించిన స్కెచ్‌లను రివీల్ చేసింది. కారెన్స్ ఎంపీవీ కారు కాదు. కానీ లుక్ మాత్రం చూడటానికి ఎంపీవీ కారు తరహాలో ఉంది. సెల్టోస్ ప్లాట్‌ఫాంపై ఈ కారును రూపొందించారు. కానీ లుక్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంది. కారెన్స్ సైడ్ వ్యూ చూడటానికి సెల్టోస్ తరహాలో ఉంటుంది.
కారు ముందువైపు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైగర్ ఫేస్ డిజైన్‌తో పాటు గ్లాస్ హౌస్, రూఫ్ లైన్ కూడా మారాయి. ఇందులో క్లాడింగ్ కూడా ఉంది. వీటి అలోయ్ సైజు 18 అంగుళాలుగా ఉండటం విశేషం. వెనకవైపు కొత్త తరహా ల్యాంప్ సెటప్ అందించారు. మూడు వరుసల సీట్లు ఉన్నప్పటికీ దాన్ని వీలైనంత వరకు కనిపించకుండా చేసేలా ఈ కారును డిజైన్ చేశారు.
ఒకరకంగా ఈ కారు డిజైన్ సెల్టోస్‌ను ఎక్స్‌టెండ్ చేసినట్లు ఉంది. ఇంటీరియర్ డిజైన్ మాత్రం అన్ని కియా కార్ల తరహాలోనే ఉంది. ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్ ఉంది. గేర్ సెలెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంది.
కార్ టెక్, సన్ రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. 6 లేదా 7 సీటర్ లే అవుట్లతో మరిన్ని వెర్షన్లు ఇందులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రెండో వరుసలో కూర్చునే ప్యాసెంజర్లకు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ఆటోమేటిక్, మాన్యువల్ వేరియంట్లు కూడా అందించనున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఈ కారు పూర్తి స్థాయిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?