రాధేశ్యామ్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది. అయితే, ఈసారి కేవలం హిందీ పాటను మాత్రమే విడుదల చేశారు. ‘సోచ్ లియా’ అంటూ సాగే ఈ పాటలో.. హీరో ప్రభాస్, పూజా హెగ్డేల ఎమోషన్ సీన్స్ గుండెను పిండేస్తున్నాయి. ఈ పాటను చూస్తుంటే.. పూర్తిగా ప్రేమలో మునిగిన హీరో, హీరోయిన్ల మధ్య బ్రేకప్ అయినట్లు స్పష్టమవుతోంది. పాట ఆరంభమే చక్కని ఫీలింగ్‌తో మొదలవుతుంది. ఆ తర్వాత.. ఒకరి కోసం ఒకరు తపన పడుతున్న సీన్లు చూపించారు. అనంతరం కొన్ని రొమాంటిక్, మెమోరీ సీన్స్‌తో ఈ పాట నడుస్తుంది. ప్రభాస్, పూజా హెగ్డే.. ఇద్దరూ ఈ పాటలో అందంగా కనిపించారు. ఈ పాట ప్రభాస్ అభిమానుల మనసు దోచుకోవడం పక్కా. 



‘రాధే శ్యామ్’ నుంచి ఇప్పటివరకూ రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఒకటి... ‘ఈ రాతలే..’. సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, గాయని హరిణి ఆలపించగా... జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. సిద్ శ్రీరామ్ పాడిన మరో పాట ‘నగుమోము తారలే...’ కూడా యూట్యూబ్‌లో బాగా ట్రెండవుతోంది. అయితే, ఈ పాటను హిందీ, తెలుగు తదితర దక్షిణాది భాషల్లో వేర్వేరుగా కంపోజ్ చేశారు. కొన్ని సీన్స్‌ను కూడా మార్చారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా.. హిందీ పాటలకు మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ బాణీలు అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ‘రాధే శ్యామ్’ సినిమాను విడుదల చేయనున్నారు. ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ చిత్రాన్ని నిర్మించారు.



Also Read: అషూ రెడ్డి ప్రెగ్నెంట్.. తల్లి చేతిలో చావుదెబ్బలు, వీడియో వైరల్


Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి