Weekly Horoscope in Telugu:  ఈ వారం రాశిఫలాలు


వృషభ రాశి (Taurus Weekly Horoscope)


ఈ వారం మీ జీవితం హెచ్చు తగ్గులతో నిండి ఉంటుంది. కొత్త శక్తితో మీ పనిపై దృష్టి సారిస్తారు. ఉద్యోగానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారం ఆరంభంలో మిశ్రమ ఫలితాలున్నా.. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారి అడుగు ముందుకుపడుతుంది. అధ్యయనాలపై దృష్టి సారిస్తారు. ఇంట్లో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వివాహ సంబంధాలకు సంబంధించి మంచి అవకాశాలు వస్తాయి. గుండె రోగులకు చాలా ఇబ్బంది ఉండవచ్చు. 


కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)  


ఈ వారం మీ కలలు నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. కష్టానికి తగిన మంచి ఫలితాలు పొందుతారు.  మీ అన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఈ వారం ప్రేమ జీవితానికి చాలా పవిత్రమైనది. సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది. సైన్స్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ వ్యక్తులు కొత్త ఉపాధి పొందవచ్చు. ఈ వారం మధ్యలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటారు.  అనవసరమైన రచనల్లో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు. ఈ వారం రహస్య శత్రువులు చురుకుగా ఉండవచ్చు. పాత రుణ కేసులు మిమ్మల్ని బాధించవచ్చు. మీరు సామాజిక ప్రజా ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన డబ్బు వృధా అవుతుంది. మనస్సులో అభద్రత భావన ఉంటుంది.


Also Read: అఘోరాలు పూజించే శివుడి రూపం ఇలా ఉంటుంది.. మీరు పూజించే రూపానికి పూర్తి భిన్నంగా!


కన్యా రాశి  (Virgo Weekly Horoscope) 


ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు మంచి ఫలితాలు పొందుతారు. డబ్బు సంపాదించేందుకు బలమైన అవకాశం ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో సాధారణ ఫలితాలు పొందుతారు. విదేశాలకు వెళ్ళే ప్రణాళికలు వేసుకుంటారు. పిల్లల పురోగతితో ఆనందంగా ఉంటుంది. మీరు చాలా మంచి ఫలితాలు పొందుతారు. వింత ఆలోచనలు కలుగుతాయి. డబ్బుని మీ బలహీనతగా మార్చుకోవద్దు.  జీవిత భాగస్వామికి గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించండి. మీ ప్రవర్తనను మంచిగా ఉంచండి. ప్రేమ వ్యవహారాలు కలసిరావు. వ్యాపారంలో సమస్యలు అధిగమిస్తారు. ఏదో విషయంలో గందరగోళానికి గురవుతారు.


వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope) 


ఈ వారం నూతన రాజకీయ సంబంధాలు ఏర్పడతాయి. దగ్గరి బంధువులలో మీ గౌరవం పెరుగుతుంది. మీ ఆలోచనలలో సానుకూలత ఉంటుంది. విద్యార్థులకు సమయం చాలా మంచిది.  మీ ధైర్యాన్ని పెంచడంలో జీవిత భాగస్వామి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కుటుంబంలో సంతోష విషయాలు జరుగుతాయి. మీరున్న రంగంలో కొత్త బాధ్యత పొందుతారు. ఈ వారం మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.  చర్మ వ్యాధులు మిమ్మల్ని బాధపెడతాయి. పూర్వీకుల ఆస్తి కేసులపై వివాదం ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య ఇతరుల విషయాలపై చర్చ వద్దు. ప్రభుత్వ పనులు ఆలస్యం కావచ్చు.  


ధనుస్సు రాశి  (Sagittarius Weekly Horoscope) 


మీరు ఈ వారం శుభవార్త వింటారు. ట్రేడింగ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థులు ప్రత్యేక అధ్యయనాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. పాత పెట్టుబడి కారణంగా సంపద పెరుగుతుంది. స్నేహితుల సహాయంతో, పెద్ద ప్రాజెక్టులు చేపడతారుయ  జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. మీ బాధ్యతల విషయంలో గౌరవప్రదంగా ఉండండి. ఇంట్లో విభజన -లాంటి వాతావరణం ఉండవచ్చు. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అధిక ఆహారం తీసుకోవద్దు. అనవసరంగా ప్రయాణించవద్దు.


Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!
 
మకర రాశి (Capricorn Weekly Horoscope)


జీవిత భాగస్వామితో సంబంధం ఈ వారం చాలా బాగుంటాయి. ఫీల్డ్‌లో మీ స్థానం బలంగా ఉంటుంది. మీ పనితీరు ఉన్నతాధికారులను మెప్పిస్తుంది. కొత్త ఉద్యోగ ఆఫర్‌లను పొందుతారు. కొన్ని సాహస నిర్ణయాలు వారం మధ్యలో తీసుకోవచ్చు. మీ ప్రవర్తనలో సానుకూలత ఉంటుంది. తండ్రి సలహాను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ విజయాలతో సంతృప్తి చెందుతుంది. భాగస్వామ్య ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో  కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. చర్చకు దూరంగా ఉండండి. వ్యాపారంలో తక్కువ లాభం ఉంటుంది. మీ ఆలోచనలు నియంత్రించండి.   అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి.


కుంభ రాశి  (Aquarius Weekly Horoscope) 


ఆలోచనలు కాదు పనిపై శ్రద్ధ వహించండి. మీ మనసులో భవిష్యత్తు గురించి  సృజనాత్మక ఆలోచనలు ఉంటాయి. వైవాహిక జీవితం బావుంటుంది.  మీ అభిరుచుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మానసికంగా బలంగా ఉంటారు. ఉన్నత విద్యలో ఉండేవారు  స్కాలర్‌షిప్‌లను పొందుతారు. ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం సముచితం కాదు. మీరు నెరవేర్చలేని ప్రతిజ్ఞలు చేయవద్దు.  కుటుంబ సభ్యుడి పొరపాటుపై మీ మానసిక స్థితిని పాడుచేస్తుంది. మీ అతి విశ్వాసం మిమ్మల్ని గందరగోళానికి గురిచేస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. 


 Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  


Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!