ఫిబ్రవరి 23 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీరు ఎలక్ట్రానిక్ వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించండి. హోటల్ వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు  నాణ్యతను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామి దగ్గర ఏమీ దాచవద్దు. ఆరోగ్యం జాగ్రత్త


వృషభ రాశి


కొత్తగా పెళ్లైనవారు టూర్ ప్లాన్ చేసుకుంటారు. ప్రేమికులు వివాహం గురించి చర్చించుకుంటారు. వ్యాపారంలో ఆకస్మిక డబ్బు ప్రయోజనం ఉంటుంది. విద్యార్థులు విద్యలో గొప్ప ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడుతుంది. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు


మిథున రాశి


ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటారు. వ్యక్తిగత సమస్యల ప్రభావం మీ వృత్తి జీవితంపై పడనీయవద్దు. పాత ఆస్తిని ఆకస్మికంగా అమ్ముకోవాల్సి వస్తుంది. సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటారు.


Also Read: అఘోరాలు పూజించే శివుడి రూపం ఇలా ఉంటుంది.. మీరు పూజించే రూపానికి పూర్తి భిన్నంగా!


కర్కాటక రాశి


ఈ రోజు వ్యాపారంలో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. పిల్లల ఆనందం కోసం  నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని అతిథులు వస్తారు. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.


సింహ రాశి


మీ సామర్థ్యాలను దుర్వినియోగం చేసుకోవద్దు. వైవాహిక సంబంధాల గురించి కొంత భావోద్వేగం చెందుతారు. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయొద్దు. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇతరుల చర్యల్లో జోక్యం చేసుకోవద్దు.
 
కన్యా రాశి


ఈ రోజు ప్రయాణించేందుకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మీడియాలో కీర్తిని పొందుతారు. తెలివిగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగులకు ఎదురైన ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. రుచికరమైన ఆహారాన్ని ఆనందిస్తారు.


Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే


తులా రాశి


ఎప్పటి నుంచో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. రక్తపోటు రోగులు కొంచెం అసౌకర్యంగా అనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు పని ఒత్తిడి పెరుగుతుంది.


వృశ్చిక రాశి


ఈ రోజు ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తనతో మనస్సు సంతోషంగా ఉంటుంది. సోదరులు , సోదరీమణుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై పనిని ప్రారంభించవచ్చు. ప్రయాణంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  


ధనుస్సు రాశి


మీ ఉద్యోగ వ్యవహారాలను, వ్యక్తిగత వ్యవహారాలకు లింక్ పెట్టొద్దు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.  


మకర రాశి


ఈ రోజు జీవిత భాగస్వామికి సమయం కేటాయించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆనుకోని ఖర్చులుంటాయి. నూతన ఆస్తిని కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయం. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది. మీ సలహాల కోసం సన్నిహితులు ఎదురుచూస్తారు. 


Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది


కుంభ రాశి


ఉద్యోగం, వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది సరైన సమయం కాదు. పని విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వద్దు. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.


మీన రాశి


ఈ రోజు కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందరితో ప్రేమగా ప్రవర్తిస్తారు. సమాజంలో మీ ఖ్యాతిపెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.