కైలాశంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, మునులు,భూతగణాలతో నిండి  ఉన్న కొలవులో శంకరుడు మధ్యలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన పార్వతీదేవి భర్త కళ్లు మూసింది. అంతే..లోకాలన్నీ చీకటిమయం అయిపోయాయి. అర క్షణంలో జీవులన్నీ అల్లాడిపోవడం చూసి శంకరుడు మూడో కన్ను తెరిచాడు. ఇంకేముంది హిమనగరం మండిపోవడం మొదలైంది. అదిచూసిన గౌరీదేవి ...'స్వామీ మూడోకన్ను తెరిచారేమి'  ఆ కారణంగా నా తండ్రి హిమవంతుడికి బాధ కలిగిందని వేడుకుంది. నీకు చెప్పకూడని రహస్యాలు నా దగ్గర లేవు, సర్వలోకాలు నన్ను పట్టి ఉంటాయి, నువ్వు నా రెండు కళ్లూ మూసేస్తే లోకం చీకటిమయం అయింది. అందుకు మూడోకన్ను తెరవాల్సి వచ్చిందన్నాడు. కూల్ గా స్పందించిన భర్తని చూసి ఇధే మంచి సయంలో తనలో ఉన్న సందేహాలన్నీ తీర్చేసుకోవాలి అనుకుంది అమ్మవారు. ఇంకేముంది ప్రశ్నల వర్షం కురిపించింది. 


1.పార్వతి:  కంఠం మీద నల్లమచ్చ ఎందుకు?
శివుడు: దేవతలు, దానవులు కలిసి పాలసముద్రం మధించినపుడు వచ్చిన హలాహలాన్ని మింగి అక్కడ ఉంచాను. అందుకు అక్కడ మచ్చ కనిపిస్తుంది. 


2. పార్వతి: పినాకమనే విల్లు ధరిస్తారెందుకు 
శివుడు: కణ్వుడనే మహాముని ఆదియుగంలో తపస్సు చేశాడు. ఆయనపై పుట్టలు మొలిచాయి. ఆ పుట్టమీద ఒక వెదురుపొద మొలిచింది. అద్భుతంగా పెరిగిన ఆ వెదురు నుంచి బ్రహ్మ మూడు విల్లులు తయారు చేశాడు. ఉందులో ఒకటి పినాకము( నా దగ్గర ఉంది), రెండోది శారంగం( విష్ణువు దగ్గరుంది), మూడోది బ్రహ్మదగ్గరుంది. పినాకం నా చేతిలో ఉన్నప్పటి నుంచి పినాకపాణిగా పిలుస్తున్నారు.
 
3. పార్వతి: లోకంలో మరే వాహనం లేనట్టు ఎద్దును వాహనం చేసుకున్నారెందుకు?
 శివుడు: హిమనగం దగ్గర తపస్సు చేసుకుంటున్నప్పుడు చుట్టూ చేరిన గోవులు కారణంగా నా తపస్సుకి భఘంగ కలిగింది. కోపంగా చూడగా అవి పడిన బాధని పోగొట్టేందుకు శ్రీ మహావిష్ణువు వృషభాన్ని కానుకగా ఉచ్చాడు.  అప్పటినుంచి ఎద్దు నా వాహనమైంది.


4.పార్వతి: ఇంట్లో ఉండక శ్మశానంలో ఉంటారేంటి స్వామి?
శివుడు: భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మ నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు సురక్షితంగా ఉన్నాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం, జనం తిరగని స్థలం, అందుకే ఇక్కడ నుంచి లోకాలను రక్షించాలనుకున్నా.


5. పార్వతి: భస్మ  లేపనం, పాములు ధరించడం, శూలం, పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఎందుకు స్వామి?
శివుడు: లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం, రెండవది ఉష్ణం. సౌమ్యం విష్ణువు, అగ్ని నేను అందుకే భస్మం సహా ఈ భీకర రూపం.


లోకమాత అయిన అమ్మవారికి ఇవన్నీ తెలియవని కాదు..సాక్షాత్తూ స్వామివారితో సకల జీవులకు తన భర్త గొప్పతనం తెలియజెప్పేందుకే నిండు సభలో ఈ ప్రశ్నలు వేసింది పార్వతీ దేవి. 


ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం 
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా  శివోమే అస్తు సదా శివోం


Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే


Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే