Maha Shivaratri 2025:  శివుడిని లింగరూపంలో నిరాకారుడిగా పూజిస్తారు. అయితే కొన్ని ఫొటోస్ లో పార్వతీసమేతంగా కుమారస్వామి, వినాయకుడితో నిండుగా కనిపిస్తాడు, మరో రూపంలో ధ్యానంలో ఉంటాడు..ఇంకో రూపంలో శ్మసానంలో భయంకరంగా కనిపిస్తాడు..ఈ ప్రతి రూపం వెనుకా ఓ ఆంతర్యం ఉంది. ఒక్కో రూపం ఒక్కో రకమైన భక్తులతో పూజలందుకుంటుంది. మరి అఘోరాలు పూజించే రూపం ఏంది? మీరు నిత్యం పూజించే రూపం ఏది?  
 
శివుడి రూపాలు 5


తత్పురుషం


అఘోరం


సద్యోజాతం


వామదేవం


ఈశానం


Also Read:  అయ్యవారిపై అమ్మవారికి ఎన్ని సందేహాలో, భోళా శంకరుడిని పార్వతి అడిగిన ప్రశ్నలివే


తత్పురుషం


ఈ రూపంలో పరమేశ్వరుడు తేజోవంతుడిగా ధ్యానంలో కూర్చుని చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు. తూర్పు ముఖంగా కూర్చుని ధ్యానం చేసే ఈ రూపాన్ని తత్పురుషం అంటారు. ఈ రూపంలో ఉండే శివుడు కేవలం దేవతలకు మాత్రమే దర్శనమిస్తాడు..వాళ్లు మాత్రమే పూజలు చేయగలరు.


అఘోరం


ఈ రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది. దిగంబంరంగా, నల్లని కాటుకతో, శరీరం అంతా బూడిదతో చూడాలంటనే భయపడేలా ఉంటుంది. కపాలాలనే ఆభరణాలుగా ధరిస్తాడు. మూడోకన్ను తెరిచి శవాలవైపు చూస్తూ అత్యంత భయంకరంగా కనిపిస్తాడు. ఈ రూపాన్ని పూజించేది, దర్శించుకునేది కేవలం అఘోరాలు మాత్రమే. భూతప్రేతాలను అదుపులో ఉంచి ఈ సృష్టిని కాపాడే రూపం ఇది. 


సద్యోజాతం


శంకరుడిని పూజించాలి అనుకునేవారు నిరాకారుడైన లింగరూపుడిని పూజిస్తారు. నిత్యం ఆలయాల్లో పూజలు జరిగేది, భక్తులు దర్శించుకునేది ఈ రూపాన్నే. దీనినే సద్యోజాతం అని పిలుస్తారు. ఈ రూపంలో ఉన్న శివుడిని యోగులు, సిద్ధులు ఎక్కువగా పూజిస్తారు. 


Also Read: శివ మంత్రమే ఎందుకు 'మృత్యుంజయ' స్త్రోత్రం అయింది


వామదేవం


శివుడంటే బూడిద పూసుకుని ఉండడమే కాదు..అలంకార ప్రియుడు అని చాటిచెప్పే రూపం వామదేవం. ఇంట్లో దేవుడి మందిరంతో కుటుంబ సమేతంగా అలంకారంతో శివుడు దర్శనమిచ్చే శివుడి రూపం వామదేవమే. మిగిలిన రూపాలకు భిన్నంగా వామదేవంలో ఉంటాడు శివుడు. ఈ రూపంలో పక్కనే పార్వతీ దేవి, ఒడిలో కుమారస్వామి - వినాయకుడు ..ఎదురుగా నందితో చూడముచ్చటగా ఉంటాడు. ఆలయాల్లో లింగరూపాన్ని పూజిస్తే..ఇంట్లో పూజలందించేది ఈ రూపానికే.


ఈశానం


ఈశానం అనే మరో రూపంలో  కేవలం అత్యంత ప్రియభక్తులకు మాత్రమే దర్శనమిస్తాడు..అనుగ్రహిస్తాడు.


Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!


శివపంచాక్షర స్తోత్రం


నాగేంద్రహారాయ త్రిలోచనాయ 
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమః శివాయ


మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ
తస్మై "మ" కారాయ నమః శివాయ


శివాయ గౌరీ వదనాబ్జ బృంద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై "శి" కారాయ నమః శివాయ


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమః శివాయ


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమః శివాయ


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే