Weekly Horoscope in Telugu: ఈ వారం రాశిఫలాలు
మేష రాశి (Aries Weekly Horoscope)
ఈ వారం ప్రారంభంలో ఆర్థిక ప్రయోజనం పొందుతారు.ఓ గుడ్ న్యూస్ వింటారు. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. క్రొత్త ప్రారంభాలకు ఈరోజు మంచిది. మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపర్చుకోండి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయవచ్చు. ప్రేమ వ్యవహారాలు వివాహం వరకూ వెళతాయి. కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. దీర్ఘకాల వ్యాధుల నుంచి బయటపడతారు. ఎప్పటి నుంచో ఆగిన పనులు ఈ వారం పూర్తవుతాయి. స్టాక్ మార్కెట్లో పెద్ద పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయవద్దు. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. స్వార్థపూరిత స్నేహితుల నుంచి దూరంగా ఉండాలి. ఒత్తిడితో కూడిన పరిస్థితులను నివారించడానికి ధ్యానం చేయడం మంచిది. ఓపికగా ఉన్న తర్వాత నిర్ణయాలు తీసుకోండి.
మిథున రాశి (Gemini Weekly Horoscope)
ఈ వారం మీరు కొత్త ప్రారంభాలు చేసేందుకు మంచిది. ఇతరుల మాటలపై పెద్దగా శ్రద్ధ చూపించవద్దు. ఇంటి వాతావరణంలో సానుకూలత ఉంటుంది. మీ ప్రణాళిక విజయవంతమవుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీ స్నేహితులు మీకు సహాయం చేస్తారు. విద్యా రంగంలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో మార్పులుంటాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి పొందుతారు. ఒత్తిడి కారణంగా చికాకుగా ఉంటారు. రోజువారీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచండి. అకస్మాత్తుగా పెద్ద నిర్ణయం తీసుకోవడం సముచితం కాదు. పెద్ద మూలధనాన్ని పెట్టుబడి పెట్టడం వల్ల సమస్యలు వస్తాయి. ప్రేమికులు పరస్పర సంబంధాలను అనుమానించకూడదు. ఆర్థిక కార్యకలాపాల గురించి జాగ్రత్తగా ఉండండి.
Also Read: అఘోరాలు పూజించే శివుడి రూపం ఇలా ఉంటుంది.. మీరు పూజించే రూపానికి పూర్తి భిన్నంగా!
సింహ రాశి (Leo Weekly Horoscope)
ఈ వారం మీకు చాలా శుభంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచడం ద్వారా మనస్సు ఉత్సాహంగా ఉంటుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సహాయం పొందుతారు. మీ ప్రవర్తనను మంచిగా ఉంచండి. ఇంట్లో కొన్ని దుర్ఘటనలు తగ్గుతాయి..ఇది మీ మనస్సును సంతోషపరుస్తుంది. కెరీర్‌లో ప్రమోషన్ కోసం అవకాశాలు ఉంటాయి. మీ సామర్థ్యాలను అద్భుతమైనదిగా ఉపయోగించుకుంటారు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు తగిన సమయంలో పూర్తికావు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ బయటపడతాయి. మాటల్లో పరుషపదాలు వినియోగించవద్దు. మనలులో అభద్రత భావన ఉంటుంది. ఎవరితోనూ వాదించవద్దు. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది.
తులా రాశి (Libra Weekly Horoscope)
మీ పని పట్ల విధేయులుగా ఉంటారు. లక్ష్యాలను తన శక్తితో నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. చెడు అలవాట్లను నియంత్రించడంలో విజయవంతమవుతారు. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్ లో ప్రశంసలు అందుకుంటాయి. ఉద్యోగ నిపుణులకు సమయం చాలా కలిసొస్తుంది. ఇంట్లో ఒక మతపరమైన సంఘటన జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఏదో విషయం గురించి అపార్థం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం ఇవ్వండి. సబార్డినేట్ ఉద్యోగుల పని మీకు సంతోషాన్నివ్వదు. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. మానసిక స్థితిని మంచిగా ఉంచండి. స్నేహితులను అనుమానించవద్దు. ప్రైవేట్ వ్యవహారాల్లో బయటి వ్యక్తులను జోక్యం చేసుకోవడానికి అనుమతించవద్దు.
Also Read: విందు భోజనానికి పిలవరు.. విషాహారానికి అగ్రస్థానం ఇస్తారు- ఎట్టాగయ్యా శివా!
మీన రాశి (Pisces Weekly Horoscope)
ఈ వారం ఈ రాశి వ్యాపారులు అద్భుతమైన లాభాలు పొందుతారు. పెద్ద ఆస్తి ఒప్పందాలు ఉండవచ్చు. ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు. పెద్దల మార్గదర్శకత్వం మీకు విజయాన్ని అందిస్తుంది. ఉద్యోగంలో ఉండేవారి ఆదాయం పెరుగుతుంది. పాత స్నేహితులు మీతో వ్యాపారం గురించి చర్చిస్తారు. వైవాహిత జీవితం సంతోషంగా సాగిపోతుంది. పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు శ్రద్ధ పెట్టండి. లోతైన ఆలోచనలు మిమ్మల్ని బాధపెడతాయి. జీవితంలో కొత్తదనం గురించి ఆలోచించేకన్నా యథాస్థితి మీకు సంతోషాన్నిస్తుందని గుర్తించండి.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: శివుడు స్మశానంలో ఎందుకు ఉంటాడు .. శివాలయాలు శ్మసానంతో సమానమా!