Ugadi Yearly Rasi Phalalu 2025: శ్రీ విశ్వావసు నామ  సంవత్సరంలో  కన్యారాశివారికి ఏ నెలలో ఎలాంటి ఫలితాలున్నాయి...


కన్యా రాశి (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త మొదటి రెండు పాదాలు)
ఆదాయం : 14 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6


కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


ఏప్రిల్ 2025


ఈ నెలలో గ్రహసంచారం మిశ్రమ ఫలితాలనిస్తోంది. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు, ఆర్థిక లావాదేవీలు బాగానే జరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కానీ వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. విరోధాలకు దూరంగా ఉండడం మంచిది. గృహ మార్పులు తప్పవు.


మే 2025


అన్నిరంగాల వారు లాభపడతారు. అనుకున్న టైమ్ కన్నా వేగంగా పనులు పూర్తవుతాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వాహన సౌఖ్యం ఉంటుంది. శుభకార్యాలు నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన పరిచయాల వల్ల లాభాలుంటాయి. 


జూన్ 2025


గ్రహాల అనుకూల సంచారం వలన చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో మంచి ఫలితాలుంటాయి. ఆదాయానికి లోటుండదు. వాహనాలకు మరమ్మతులు చేయిస్తారు. 


మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


జూలై 2025


కన్యా రాశివారు ఈ నెలలో  మానసికంగా ఉల్లాసంగా ఉంటారు కానీ ఆదాయం సరిపడా చేతిలో ఉండదు. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అప్పులు చేయాల్సి వస్తుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. చేసే వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి కానీ ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఇవ్వవు. జాయింట్ వ్యాపారాలు ఆగిపోతాయి.


ఆగష్టు 2025
 
ఈ నెలలో అనారోగ్య సమస్యలు, శస్త్రభయం తప్పదు. ప్రతి నిముషం కష్టంగానే ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. అప్పులు చేయాల్సి వస్తుంది. సరైన సమయానికి డబ్బు చేతికి అందక అమర్యాదలపాలవుతారు. చేయన తప్పులకు నిందలపాలవుతారు


వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


సెప్టెంబర్ 2025


ఈనెలలో మిశ్రమఫలితాలుంటాయి. ప్రధమార్థంలో ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలమే. వృత్తివ్యాపారాల్లో రాణిస్తారు. మనఃశ్శాంతి ఉండదు. కొన్నివిషయాల్లో బాధలుతప్పవు. ఉద్యోగులకు చలనం తప్పదు.
 
అక్టోబర్ 2025


ఈ నెలలో అనుకూల గ్రహసంచారంలేనికారణంగా ఇబ్బందులుంటాయి. మానసికంగా కుంగిపోతారు. ప్రతిచిన్న విషయానికి ఆందోళన ఉంటుంది.  ధనం మంచినీళ్లలా ఖర్చవుతుంది. బంధుమిత్ర విరోధాలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండక విరోధాలేర్పడతాయి. వాహనప్రమాద సూచనలున్నాయి జాగ్రత్తపడండి. 


నవంబర్ 2025


జన్మరాశిలో రవి, శుక్రులు సంచారం వలన ఉద్రేకం పెరుగుతుంది. ప్రతీ చిన్న విషయానికి గొడవలు,ఏం మాట్లాడిన విరోధమే ఎదురవుతుంది. గతంలో మిమ్మల్ని మెచ్చుకున్నవారు కూడా ఈ రోజు విమర్శిస్తారు. ఆర్థికంగా చాలా నష్టపోతారు. పోలీసు కేసుల్లో ఇరుక్కొంటారు.  


 (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


డిశంబర్ 2025


ఈ నెలలో కొంతమేర మంచి ఫలితాలే ఉంటాయి. చేసే వృత్తివ్యాపారాల్లో రాణిస్తారు. శారీరకశ్రమ పెరుగుతుంది కానీ  ఆర్దికంగా కొంతఉత్సాహంగా ఉంటుంది. దూరప్రయాణాల్లో లాభాలుంటాయి. సంతానవృద్ధి, వ్యసనాల్లో డబ్బులు అధికంగా ఖర్చవడం జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.


జనవరి 2026 


నూతన సంవత్సరం జనవరి 2026లో మీకు అనుకూల గ్రహసంచారంవలన అన్నిరంగాలవారికి శుభ ఫలితాలుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. సమస్యల వలయం నుంచి బయటపడతారు. ఎంతటి వారితోనైనా మాట్లాడగల ధైర్యం మీ సొంతం. వాహన సౌఖ్యం ఉంటుంది. నూతన పరిచయాలు కలిసొస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు 


ఫిబ్రవరి 2026 
 
శ్రీ విశ్వాసవసు నామ సంవత్సరం ఫిబ్రవరి 2026లో మీకు తిరుగులేదు. వ్యవహార జయం, ఆదాయంలో వృద్ధి, సంతోషం అన్నీ మీ సొంతం. అప్పటివరకూ ఉన్న సమస్యలన్నీ ముబ్బుల్లా విడిపోతాయి. కుటుంబంలో సఖ్యత ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి.  


 (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   


మార్చి 2026


ఈ నెలలో గ్రహసంచారం మీకు అనుకూల ఫలితాలనే ఇస్తుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా లాభపడతారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూల తీర్పు వస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. ఉద్యోగులకు స్థానచలనం తప్పదు.  


గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.


(సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)