Ugadi Yearly Rasi Phalalu 2025: కన్యారాశి వారికి శ్రీ విశ్వావసు నామసంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకమైన కాలం. శని, గురుడు ఇద్దరూ బలమైన స్థానాల్లో ఉండడంతో అత్యంత గౌరవప్రదమైన జీవితం గడుపుతారు. రాజకీయం, ఉద్యోగం, విద్య, కళా, సాహిత్యం, వ్యాపారం సహా అన్ని రంగాల్లో ఉండేవారూ పైచేయి సాధిస్తారు. ఎంత గొప్ప వ్యక్తులను అయినా, ఎంత పెద్ద సమస్యలను అయనా లెక్క చేయరు. వాహనం కొనుగోలు చేస్తారు. అవివాహితులకు వివాహం సూచనలున్నాయి. స్త్రీ కారణంగా మీకు కలిసొస్తుంది. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకున్నవారికి పూర్తిస్థాయిలో ఉపశమనం లభిస్తుంది. అయితే అతి కోపం వల్ల ఒక్కోసారి చేపట్టిన పనులు చెడిపోతాయి...ఆ తర్వాత మిమ్మల్ని మార్చుకుని పనులు పూర్తిచేస్తారు. 


ఉద్యోగులు


కన్యా రాశి ఉద్యోగులకు ఈ ఏడాది బాగా కలిసొస్తుంది. కొన్నాళ్లుగా పడుతున్న బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితం గడిపేస్తారు. ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్స్ ఉంటాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. 


మేష రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


రాజకీయ నాయకుల


రాజకీయ నాయకులకు శ్రీ విశ్వావసు నామసంవత్సరంలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీ సేవలను అదిష్టానవర్గంవారు గుర్తిస్తారు. పదవికోసం ఎదురుచూస్తున్నవారి కల ఫలిస్తుంది. డబ్బు ఖర్చు అవుతుంది కానీ అన్నింటా మీదే పైచేయి అవుతుంది. 


కళాకారులకు


కళాకారులకు మిశ్రమ ఫలితాలుంటాయి. నూతన అవకాశాలు అంతంతమాత్రంగా ఉంటాయి. రావాల్సిన అవార్డులు ఆఖరి నిముషంలో చేజారిపోతాయి. మనోధైర్యం కోల్పోతారు. వివాదాస్పద విషయాల్లో చిక్కుకుంటారు కానీ అంతలోనే బయటపడతారు. 


వ్యాపారులు


శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వ్యాపారులకు అనుకూలమే. పెట్టిన పెట్టుబడులకు ఆశించిన లాభం పొందుతారు. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులకు అనకూలం. భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య బేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారం బావుంటుంది. పరిశ్రమలు నడుపుతున్నవారికి అనుకూలం. నిర్మాణ రంగంలో ఉండేవారికి యోగకాలం. 


వృషభ రాశి ఉగాది ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


విద్యార్థులకు


కన్యా రాశి విద్యార్థులకు 2025 -2026 లో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. పరీక్షలు బాగా రాస్తారు. మంచి మార్కులు సాధిస్తారు. ఇంజనీరింగ్, మెడికల్ సహా ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. కావాల్సిన కళాశాలల్లో సీట్లు సాధిస్తారు.  అయితే  శని, రాహువు ప్రభావం వల్ల పక్కదారి పట్టే అవకాశం ఉంది..తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించండి.


వ్యవసాయ దారులకు


శ్రీ విశ్వావసు నామ సంవత్సంరో కన్యా రాశి వ్యవసాయదారులకు రెండుపంటలు లాభిస్తాయి.ఆర్ధికసమస్యల నుంచి బయట పడతారు. పంట దిగుబడి పెరుగుతుంది. అప్పులు తీరుపోతాయి. కౌలుదార్లకు కూడా అనుకూలమే. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. చేపలు, రొయ్యలు వ్యాపారం చేసేవారికి మంచి లాభం.  


క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తారు


 (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కన్యా రాశి స్త్రీలకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో తిరుగులేదు. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు. రాహువు, కేతువు కారణంగా ఆరోగ్య భంగం తప్పదు. శస్త్ర చికిత్సలు అవసరం అవుతాయి. శనిబలం వల్ల కొంత మేర బావుంటుంది. ఉద్యోగాల్లో ఉండే స్త్రీలకు ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి. వివాహం కానివారికి ఈ ఏడాది పెళ్లి తప్పకుండా జరుగుతుంది. 


2025-2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి స్త్రీ పురుషులకు గతంలో ఉండే బాధలు తొలగి సంతోషం పొందుతారు.


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు 


గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.


 (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)