మార్చి 18 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. పెద్ద వ్యాపార ఒప్పందాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ గౌరవం పెరుగుతుంది.  మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కృషికి తగ్గా అర్ధవంతమైన ఫలితాలను పొందడం ఆనందంగా ఉంటుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది.( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


వృషభ రాశి


సామాజిక విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది. సవాళ్లను గట్టిగా ఎదుర్కొంటారు. సంభాషణ సమయంలో పదాలను జాగ్రత్తగా  వినియోగించండి. ప్రేమ వ్యవహారాలు పెళ్లిదిశగా అడుగేసేలా చేస్తాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


మిథున రాశి


మీరు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. మాటల్లో మృదుత్వాన్ని అలానే ఉంచండి. అవసరానికి తగిన డబ్బులు చేతికి అందకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కర్కాటక రాశి


ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితంలో ఒత్తిడి తొలగిపోతుంది. వ్యాపారంలో పెద్ద రిస్క్ తీసుకోకండి. కొంతమంది మీ తీరుని వ్యతిరేకిస్తారు. స్వార్థంగా వ్యవహరించవద్దు. పిల్లల పెళ్లిళ్లకు సంబంధించిన సమస్య తొలగిపోతుంది.  (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)   


సింహ రాశి


ఈ రోజు మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో అమ్మకాలు పెరుగుతాయి..ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.  ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇదే మంచి సమయం.   తండ్రి మిమ్మల్ని స్తుతిస్తాడు. మీరు ఇంటి అవసరాలకు కొత్త వస్తువులను కొనుగోలు చేయవచ్చు. (సింహరాశి ఉగాది 2025 ఫలితాలకోసం ఈ లింక్ క్లిక్ చేయండి)


కన్యా రాశి


ఈ రోజు మీరున్న రంగంలో మీరు మంచి ఉన్నతి పొందుతారు. మీ జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు విదేశీ పర్యటనల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.   


తులా రాశి


ఈ రోజు నూతన పని ప్రారంభించేందుకు మంచిది. కళాత్మక విషయాలకు ఆకర్షితులవుతారు. మీరు భాగస్వామ్య వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు.  వైవాహిక సంబంధాలలో ప్రేమ , అంకితభావం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలకు అవకాశం ఇవ్వొద్దు. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు.


వృశ్చిక రాశి
 
ఈ రోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ వహించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కాలుకి సంబంధించిన ఇబ్బందులుంటాయి. ఓ గందరగోళానికి పరిష్కారం లభిస్తుంది. ఖరీదైన వస్తువుల కొనుగోలు సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి.


ధనుస్సు రాశి


ఈ రోజు ఈ రాశి ఉద్యోగులకు అధికారులు పెద్ద బాధ్యత అప్పగించవచ్చు. కుటుంబం మీతో చాలా సంతోషంగా ఉంటుంది. వివాహేతర వ్యవహారాల నుంచి దూరంగా ఉండండి.  ప్రభావవంతమైన వ్యక్తుల మద్దతు మీకుంటుంది. స్టాక్ మార్కెట్ ద్వారా డబ్బు ప్రయోజనం పొందవచ్చు.


మకర రాశి


ఈ రోజు పాత కేసులు పరిష్కారం అవుతాయి. మీ ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యుల వాతావరణం చాలా సహకారంగా ఉంటుంది. ఫైనాన్స్‌కు సంబంధించిన కేసులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తెలియని వ్యక్తులను నమ్మవద్దు. రహస్య విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.


కుంభ రాశి


ఈ రోజు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రభుత్వ పనిలో అడ్డంకి వచ్చే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో అనవసర చర్చ జరుగుతుంది. ఉన్నత విద్య గురించి విద్యార్థులు  అప్రమత్తంగా ఉంటారు. అవసరమైన ఏదైనా పని కార్యాలయంలో ఆగిపోవచ్చు.


మీన రాశి


ఈ రోజు కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించవచ్చు. మీరు మీ గౌరవం గురించి ఆందోళన చెందుతారు. మీరు ఊహించిన పని ఊహించనట్టు పూర్తికాదు. రహస్య విభాగాలను అధ్యయనం చేసే అవకాశాలు ఉన్నాయి. తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.