మార్చి 13 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు అన్నింటా శుభ ఫలితాలే. ఆర్థిక ప్రయోజనం పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. స్నేహితులతో ముఖ్యమైన సమస్యల గురించి చర్చిస్తారు. వ్యాపారులు, ఉద్యోగులుకు సాధారణంగా ఉంటుంది. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి
మీ సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నించండి. పట్టుదలతో చాలా పనులు పూర్తిచేస్తారు. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయొచ్చు. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి
మీరున్న రంగంలో ఈ రోజు మీరు మంచి ఫలితాలు సాధిస్తారు.నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీకు మీ జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపార ప్రయోజనం కోసం ప్రయాణించవచ్చు. సృజనాత్మక ఆలోచనలు చేస్తారు.(మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి
ఈ రోజు మీ ఆత్మివిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలు అధిగమిస్తారు. మీ ఆసక్తికి అనుగుణంగా పనిచేస్తే మంచి ఫలితాలు పొందుతారు. కొత్త మూలం నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
సింహ రాశి
ఈ రోజు చాలా బాగుంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. మీరు చేయాలి అనుకున్న పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటారు. మారుతున్న వాతావరణ ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది.
కన్యా రాశి
ఈ రోజు ప్రేమ వ్యవహారాల్లో మీకు నిరాశే మిగులుతుంది. ఓ సంఘటన గురించి మనసులో అసంతృప్తి ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. విదేశాలలో నివసించే వారికి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి.
తులా రాశి
ఈ రోజు కోపాన్ని నివారించాలి. మీ నిర్ణయాల గురించి కొద్దిగా గందరగోళంగా ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆస్తి కొనుగోలు అమ్మకంలో ఇబ్బందులు ఎదురవుతాయి
వృశ్చిక రాశి
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఓ విషయం గురించి మనసులో వివిధ రకాల ఆలోచనలు సాగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ లక్ష్యాల గురించి పూర్తి కృషితో పని చేస్తారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు అధిగమిస్తారు
ధనుస్సు రాశి
ఈ రోజు మిమ్మల్ని కొన్ని సమస్యలు వెంటాడుతాయి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ ఏకాగ్రతను భంగపరిచే విషయాలపై శ్రద్ధ చూపించవద్దు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. పిల్లలకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపించండి.
మకర రాశి
ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. ఓ విషయం గురించి కొనసాగుతున్న ఉద్రిక్తతను అధిగమిస్తారు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం సాధిస్తారు. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ లక్ష్యాలు చేరుకునేందుకు కష్టపడతారు.
కుంభ రాశి
ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీ ప్రవర్తనను మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబం మీ పట్ల సహకార అనుభూతిని కలిగి ఉంటుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని ప్రయాణానికి దారితీస్తుంది. ప్రభుత్వ పనులు సులభంగా పూర్తవుతాయి.
మీన రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. రచనలపై ఆసక్తి కలిగిఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. ప్రేమ వ్యవహారాలు కలిసొస్తాయి.
గమనిక: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.