జనవరి 26 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మతపరమైన అభిప్రాయాల ప్రభావంలో ఉంటుంది. రోజు ప్రారంభం కన్నా సాయంత్రం బావుంటుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలను కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చు. 


వృషభ రాశి


ఈ రోజు మీరు అధిక బిజీ కారణంగా అలసిపోతారు. ఆకస్మిక ధన నష్టానికి అవకాశం ఉంది. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోకండి. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ జీవిత భాగస్వామి భావాలకు గౌరవం ఇవ్వండి. ప్రతికూల స్వభావం గల వ్యక్తుల నుంచి సలహా తీసుకోకండి  


మిథున రాశి


ఈ రోజు మీరు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ నుంచి సలహాలు తీసుకునేందుకు మీ సన్నిహితులు ఆసక్తి చూపిస్తారు. జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు. కొన్ని విషయాలను తెలివిగా నిర్వహిస్తారు. 


Also Read: అఘోరాలు, నాగసాధువులకు మాయమయ్యే శక్తి ఉందా.. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వెళ్లిపోతున్నారు!


కర్కాటక రాశి


ఈ రోజు మీ అదృష్టం మీద ఆధారపడి ఏ పనిని తేలికగా తీసుకోకండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. అన్ని పనులు జాగ్రత్తగా పూర్తి చేస్తారు.  గృహోపకరణాలు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తారు. 


సింహ రాశి


ఈ రోజు పెట్టుబడి పెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. బంధువు విషయంలో ఇబ్బందులు రావచ్చు. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కార్యాలయంలో, మీరు అనేక పనులను ఏకకాలంలో నిర్వహించవలసి ఉంటుంది. 


కన్యా రాశి


చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి.  మీ భావోద్వేగాలను నియంత్రించండి. మీ పోటీదారులను బలహీనులుగా పరిగణించి పొరపాటు చేయవద్దు. ఆస్తి వ్యవహారాలు సమస్యలు సృష్టించవచ్చు. కోపం కారణంగా తగాదాలు రావచ్చు.


Also Read: రథసప్తమి ఎప్పుడు..ఆదిత్యుడి ఆరాధన వల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతారు!


తులా రాశి


ఏకాంతంలో ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఈరోజు మంచి రోజు. పాత జ్ఞాపకాలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. అవివాహితులతు వివాహ సూచనలున్నాయి. మీ వ్యాపారాన్ని విస్తరించేందుకు అప్పులు చేస్తారు.  మనస్సును ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోండి. 


వృశ్చిక రాశి 


నిరుద్యోగులు కొత్త ఉద్యోగావకాశాలు పొందుతారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారు. మీ స్వభావంలో చాలా మార్పు వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవచ్చు. మీరు మతపరమైన కార్యక్రమాలలో చురుకుగా ఉంటారు. మీ సహోద్యోగులను ఎక్కువగా నమ్మవద్దు. 


ధనుస్సు రాశి


మీ ప్రవర్తన ఆకర్షణీంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కెరీర్ కి సంబంధించి అద్భుతమైన అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న డబ్బు అందడం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది.


మకర రాశి


ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. అధిక వేగంతో డ్రైవ్ చేయవద్దు. మీ ప్రణాళికలు కొన్ని విఫలం కావచ్చు. చిన్న చిన్న విషయాలకే ఇరుగుపొరుగు వారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మీకు చాలా పాఠాలు నేర్పుతుంది. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి.


కుంభ రాశి 


మీరు ఈ రోజు వ్యాపారంలో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవచ్చు. బంధువులు, స్నేహితులను కలుస్తారు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడే అవకాశం ఉంది. మీ అభిరుచికి అనుగుణంగా పని చేస్తుంది. శత్రువులతో రాజీ పడవచ్చు. పనికిరాని పనిలో సమయాన్ని వృథా చేయకండి. 


మీన రాశి


మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు శుభవార్తలు అందుతాయి. ఫార్మసీ వ్యాపారంలో ఉండేవారి ఆదాయం పెరుగుతుంది. పై అధికారుల సహాయం అందుతుంది. మీరు వైవాహిక జీవితంలో కొత్తదనాన్ని అనుభవిస్తారు. మిత్రులతో సమస్యలపై చర్చిస్తారు.


Also Read: మౌని అమావాస్య, శివరాత్రికి భారీ రద్దీలో కుంభమేళాకి పరిగెత్తకండి.. ఇంట్లోనే ఇలా చేయండి చాలు!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.