జూలై 08 రాశిఫలాలు

మేష రాశి


ఈ రోజు మేష రాశి వారు కెరీర్‌లో కొత్త విజయాలు సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్‌లో పని చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సంబంధాలలో ప్రేమ , నమ్మకం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు.  ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి  రాబడిని పొందుతారు. దాతృత్వ కార్యక్రమాలకు  డబ్బు ఖర్చు చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు


వృషభ రాశి 


ఈ రోజు పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఆఫీసు పనిలో సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. వ్యాపారం బావుంటుంది. ఆర్థిక విషయాలలో అదృష్టవంతులు అవుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. 


మిథున రాశి


మీ జీవితంలో ఉత్తేజకరమైన మలుపు ఉంటుంది.  ఉద్యోగులు కార్యాలయంలో పనితీరుకి ప్రశంసలు పొందుతారు.  కెరీర్‌లో ఎదుగుదలకు అనేక అవకాశాలు ఉంటాయి. ఆదాయం , ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించండి.  డబ్బు విషయంలో తోబుట్టువులతో వివాదాలు ఉండవచ్చు. న్యాయపరమైన విషయాలకు దూరంగా ఉండండి. సంభాషణ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి


Also Read: జూలై 7 నుంచి జూలై 13 వరకూ ఈ వారం మీ రాశిఫలితం - ఈ 5 రాశులవారికి అదృష్టం, ఐశ్వర్యం, ఆనందం!


కర్కాటక రాశి


ఈ రోజు కర్కాటక రాశి వారి వ్యక్తిగతజీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు ప్రేమ ప్రతిపాదన పొందొచ్చు. నూతన ఆదాయ వనరుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచిది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఈ రోజు కార్యాలయంలో పోటీ వాతావరణం ఉంటుంది. సవాలుతో కూడిన పనులను ఆత్మవిశ్వాసంతో నిర్వహించండి. కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. 


సింహ రాశి


ప్రేమ, వైవాహిక జీవితం బావుంటుంది. కెరీర్ పురోగతికి మంచి అవకాశాలు ఉంటాయి.  ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కార్యాలయంలో ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో  విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాలలో రోజు చాలా బాగుంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది 


కన్యా రాశి


ఈ రోజు కన్యా రాశి వారికి ఒడిదొడుకులుంటాయి. కార్యాలయంలో బిజీ షెడ్యూల్ ఉంటుంది.  పనిబాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఉంటాయి. అనవసర కోపాన్ని తగ్గించుకోవాలి. కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. లగ్జరీ వస్తువుల కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.


Also Read: పూరీ జగన్నాథుడి రథయాత్రేకాదు..ప్రసాదమూ ప్రత్యేకమే - శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో వంటలు!


తులా రాశి


తులా రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కార్యాలయంలో నూతన ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది...కాస్త సహనం పాటించండి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ బంధంలో మూడో వ్యక్తికి చోటివ్వవద్దు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. 


వృశ్చిక రాశి 


ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు కార్యాలయంలోని ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. వ్యాపారంలో ఊహించని పురోగతిని సాధిస్తారు.  కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోండి. ఆర్థిక విషయాలలో ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. 
 
ధనుస్సు రాశి


ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామిపై ప్రేమను కురిపిస్తారు. వృత్తి జీవితంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. కార్యాలయంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి.  వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది.


Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!


మకర రాశి 


ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. సంబంధాలలో వివాదాలు పెరగవచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. కార్యాలయంలో పనిలో సవాళ్లు పెరగవచ్చు. సహనం పాటించండి. కోపం తగ్గించుకోవాలి. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి. కొత్త ఆదాయ వనరుల నుంచి ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. 


కుంభ రాశి


మీ జీవితంలో చాలా పెద్ద మార్పులు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయ పనిలో జాగ్రత్తగా ఉండాలి.  శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆఫీసులో బాస్ మీ పనిని మెచ్చుకుంటారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. కొందరు వ్యక్తులు విషపూరిత సంబంధాల నుంచి బయటపడేందుకు ప్రణాళికలు వేస్తారు. కెరీర్ లక్ష్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు.మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపండి.   


మీన రాశి


ఈ రోజు ఒడిదొడుకులతో కూడిన రోజు అవుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న వివాదాలుంటాయి..సమయం కేటాయించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతుంది. కార్యాలయంలో మీ చుట్టూ జరిగే రాజకీయాలకు దూరంగా ఉండాలి. లేదంటే దీని ప్రభావం మీ పనితీరుపై చాలా ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. తెలివిగా  ఖర్చు చేయండి. 


Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.