The story of Chappan Bhog: ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా పేర్కొనే ఈ ఉత్సవాన్ని జీవితకాలంలో ఒక్కసారి దర్శించుకున్నా జన్మధన్యం అని భావిస్తారు భక్తులు. రథయాత్ర మాత్రమే కాదు పూరీ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. వాటిలో ఒకటి మహాప్రసాదం. పూరీ జగన్నాథుడికి ఏకంగా ఆరుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఇందుకోసం 56 రకాల పదార్థాలు తయారు చేస్తారు. హిందీలో 56ని ఛప్పన్ అంటాం..అందుకే ఈ నైవేద్యాన్ని ఛప్పన్ భోగ్ గా పేర్కొంటారు. 


Also Read: వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాల్.. పూరీ రథయాత్ర గురించి మీకు తెలియని ఆసక్తికర విశేషాలివి!


జగన్నాథుడికి  56 నైవేద్యం  లెక్క ఎందుకు?


ఒకప్పుడు అఖండ భారతదేశంలో 56 స్వతంత్ర రాజ్యాలు ఉండేవి..ఆ రాజ్యాలన్నీ సుభిక్షంగా ఉండాలని రాజ్యానికో ప్రసాదం చొప్పున 56 ప్రసాదాలను నివేదించి ఉండవచ్చంటారు పండితులు. మరో పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఏడురోజుల పాటు తన చిటికెనవేలు మీద నిలిపి  ఉంచాడు..ఆ సమయంలో అన్నపానీయాలు ముట్టుకోలేదు. అందుకే ఎనిమిదో రోజు  వారానికి సరిపడా ఆహార పదార్థాలను ఒకేసారి నివేదించారట.. ఆ రోజు కన్నయ్య  56 పదార్థాలు ఆరగించాడట.. అందుకే జగన్నాథుడు కొలువైన పూరీలో ఈ ఆచారం పాటిస్తున్నారని చెబుతారు.  


శ్రీ మహాలక్ష్మి పర్యవేక్షణలో వంటలు


ఆలయానికి ఆగ్నేయ దిశలో ఉండే వంటగది ప్రపంచంలోనే అత్యంత పెద్దది అని చెబుతారు. ఇక్కడ 32 సువిశాల వంటగదులుంటాయి.  ఒక్కో వంటగది పొడవు 150 అడుగుల, వెడల్పు 100 అడుగులు, ఎత్తు 20 అడుగులు. మొత్తం  500 మంది వంటవాళ్లు, 300 మంది సహాయకులుంటారు.  700 మట్టి కుండలతో వంటలు సిద్ధంచేస్తారు. వంటగది దగ్గరుండే   'గంగా', 'యమునా' అనే బావుల నుంచి తీసుకొచ్చిన నీటిని మాత్రమే వంటకు వినియోగిస్తారు. రోజూ కనీసం 10 రకాల స్వీట్లు తయారు చేస్తారు. ఒకేసారి 50 వేల మందికి మహాప్రసాదం తయారు చేసేస్తారు.రోజుకు మొత్తం 70 క్వింటాళ్ల బియ్యం వండుతారు. ప్రసాదం తయారు చేయడానికి 7 పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి..పైభాగంలో ఉండేపాత్రపై ముందు వంటపూర్తిచేసి.ఆ తర్వాత వరుసగా వండుతూ ఒక్కోపాత్ర దించుతారు. భోగానికి ప్రతిరోజూ కొత్తతపాత్రలనే వినియోగించడం విశేషం. ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్నాథుడికోసం శ్రీ మహాలక్ష్మి స్వయంగా పర్యవేక్షిస్తందట. 


Also Read: బోనాలు, రథయాత్ర, తొలి ఏకాదశి, గురుపూర్ణిమ సహా జూలై నెలలో ఎన్ని పండుగలో!


రోజుకి 6 సార్లు నైవేద్యం 


జగన్నాథుడికి రోజుకి ఆరుసార్లు నైవేద్యం పెడతారు. తెల్లవారుఝామున 4 గంటలు, ఉదయం 8 , మధ్యాహ్నం 12, సాయంత్రం 4, రాత్రి 7.45, రాత్రి 8.30..సమయాల్లో నైవేద్యం సమర్పిస్తారు. భగవంతుడికి నివేదించిన తర్వాత భక్తులకు మహాప్రసాదాన్ని పంచిపెడతారు.వంటశాలలో సిద్ధమయ్యే పదార్థాలు ఆ సమయంలో ఎలాంటి వాసనను వెదజల్లవు...కానీ.. స్వామివారికి నివేదించిన తర్వాత మాత్రం  ఘుమఘుమలాడిపోతుంటాయ్.   రథయాత్ర సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి..ఈ సమయంలో లక్షా 14 వేలమంది వంటపనుల్లో నిమగ్నమై ఉంటారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో 6 వేలమంది పూజారులు పాల్గొంటారు. రథయాత్ర సమయంలో పది రోజల పాటూ ఆ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తుల తరలివస్తారు.  


Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!