Popular Festivals in the Month of July 2024 :  ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తర్వాత మళ్లీ పండుగల సందడి మొదలయ్యేది ఆషాడమాసంలోనే. ఏటా ఆషాడమాసంలో తెలంగాణలో బోనాల జాతర నుంచి, ఒడిశాలో జగన్నాథుడి రథయాత్ర సహా ఎన్నో పండుగలున్నాయి. ఇదే నెలలో చాతుర్మాస దీక్ష ప్రారంభమవుతుంది. 
 
జూలైలో వచ్చే పండుగలివే...
 
జూలై 2 - యోగిని ఏకాదశి 


నిర్జల ఏకాదశి తర్వాత జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. ఈ రోజు ఏకాదశి నియమాలు పాటించి ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువును పూజించాలి. ద్వాదశి ఘడియలు ప్రారంభమైన తర్వాత అవి ముగిసిలోగా అన్నదానం చేసి ఉపవాసం విరమించాలి. ఈ రోజు చేసే దాన ధర్మాల వల్ల విశేష ప్రయోజనాలు పొందుతారని కృష్ణుడు ధర్మరాజుకి చెప్పాడు..


జూలై 3 కూర్మ జయంతి


శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కూర్మావతారం ఒకటి. సత్యయుగంలో దేవతలు- రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరం చిలకడం ప్రారంభించారు. వాసుకుని తాడుగా..మందరగిరిని కవ్వంగా చేసుకున్నారు కానీ..ఆ పర్వతం సముద్రంలోకి కుంగిపోతూ సాగరమథనానికి ఆంటంకం కలిగిస్తోంది. ఆ సమయంలో దేవతలంతా శ్రీ మహావిష్ణువును వేడుకోగా..తాబేలు రూపంలోకి మారి మందరగిరి నీటమునిగిపోకుండా చేశాడు శ్రీ మహావిష్ణువు. 


Also Read:  యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!


జూలై 4 మాస శివరాత్రి


ప్రతి నెలలో అమావాస్య ముందురోజు వచ్చే చతుర్ధశిని మాసశివరాత్రిగా జరుపుకుంటారు. శంకరుడి జన్మతిథిని అనుసరించి జరుపుకునే ఈ తిథి రోజు ఉపవాసం ఉండి శివారాధన చేస్తే గ్రహ దోషాల నుంచి, దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.


జూలై 7 బోనాలు ప్రారంభం


ఏటా ఆషాడమాసంలో హైదరాబాద్ లో బోనాల సందడి మొదలవుతుంది. ఆషాడంలో వచ్చే మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం సంబరాలు మొదలవుతాయి. ముందుగా  గోల్కొండ జబదాంబిక అమ్మవారికి బంగారుబోనం సమర్పిస్తారు.  సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయంలో నెలరోజుల పాటూ ప్రతి గురువారం, ఆదివారం పూజలు నిర్వహించి..మళ్లీ  గోల్గొండ కోటలోనే చివరి రోజు పూజ చేస్తారు. వ్యాధుల నుంచి రక్షించి ఆరోగ్యాన్ని ప్రసాదించమని అమ్మవానికి వేడుకుంటారు...


జూలై 7 వారాహీ నవరాత్రులు ప్రారంభం


ఆషాడ మాసంలో పాడ్యమి నుంచి నవమి ( జూలై 6 నుంచి 15) వరకూ  వారాహీ నవరాత్రులు నిర్వహిస్తారు. తొమ్మిదిరోజుల పాటూ దీక్షగా అమ్మవారిని పూజిస్తారు, ఉపవాసాలుంటారు. వారాహీ అమ్మవారిని పూజిస్తే శత్రుభయం తొలగిపోతుంది, వ్యవహార జయం, ఆరోగ్యం సిద్ధిస్తుంది.
 
జూలై 7 రథయాత్ర
 
జగన్నాథుని రథయాత్ర జరిగేది కూడా జూలైలో వచ్చే ఆషాడమాసంలోనే. ఏడాది పాటూ గర్భగుడిలో కొలువైన జగన్నాథుడు తన సోదరి, సోదరుడితో కలసి బయటకు అడుగుపెట్టే అపురూప దృశ్యం. ఈ ఉత్సవాలు పదిరోజుల పాటూ అత్యంత వైభవంగా జరుగుతాయి. 


 Also Read: జూలై 7న పూరీ జగన్నాథుడి రథయాత్ర..ఐదు దశాబ్దాల తర్వాత ఒకేరోజు మూడు వేడుకలు!


జూలై 16 కర్కాటక సంక్రాంతి


సూర్య భగవానుడు నెలకో రాశిలో అడుగుపెట్టేరోజుని సంక్రమణం అంటారు. జూలై 16న కర్కాటక సంక్రాంతి వచ్చింది. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆరు నెలల తర్వాత మళ్లీ మకర  సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. 


జూలై 17 తొలి ఏకాదశి


ఉత్తరాయణ కాలం దేవతలకు పగలుగా.. దక్షిణాయన కాలం రాత్రిగా చెబుతారు పండితులు. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే ఏకాదశి నుంచి దేవతలకు రాత్రి కాలం మొదలవుతుంది. అంటే ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని పురాణాల్లో ఉంది. 


జూలై 21 గురు పూర్ణిమ


వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వ్యాసుడిగా మారిన కృష్మద్వైపాయనుడు..వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించాడు. వేద వ్యాసుడు అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే ఆయనను ఆదిగురువుగా పూజిస్తారు. ఆయన జన్మతిథి అయిన ఆషాడ మాస పౌర్ణమి రోజు   వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటూ తమ గురువుల నుంచి ఆశీస్సులు పొందుతారు..


Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!


జూలై 24 సంకష్ట చతుర్థి


పౌర్ణమి తర్వాత వచ్చే  చతుర్థిని సంకష్ఠ చతుర్థి అంటారు