Interesting Facts about Yakshini: యక్షిణిలు ఎవరు ? భూమ్మీద ఉన్నారా - యక్షిణి సాధన ఎందుకు చేస్తారు..ఎవరు చేస్తారు!

Yakshini : యక్షిణిలు ఈ పేరు వినే ఉంటారు. రీసెంట్ గా 'యక్షిణి' పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది. ఇంతకీ నిజంగా యక్షిణులు ఉన్నారా? ఉంటే భూమ్మీద తిరుగుతున్నారా? ఏ రూపంలో ఉంటారు? ఏం చేస్తారు ?

Continues below advertisement

Interesting Facts about Yakshini

Continues below advertisement

విశ్వానికి రాజు ఇంద్రుడు
ఇంద్రుడికి గురువు బృహస్పతి
హరిహరుల సూచనలను ఇంద్రుడు పాటిస్తాడు..
ఇక కుబేరుడిది ఆర్థిక శాఖ..  కుబేరుడి అధీనంలో ఉండేవారే యక్షిణులు..వీళ్లంతా సంపదకు కాపలాగా ఉంటారు. 
 
సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో చూపించినట్టు యక్షులు, యక్షిణిలు నెగిటివ్ ఎనర్జీ కాదు..వీళ్లంతా దేవతాగణాలే. మనుషులకు ఎదురుపడడం, పెళ్లి చేసకోవడం, పగ తీర్చుకోవడం లాంటివి చేయరు. కుబేరుడి కనుసన్నల్లో విశ్వంలో ఉండే సమస్త సంపదకు, గుప్త నిథులకు, ఆలయాలకు  రక్షణగా ఉంటారు యక్షిణిలు. 

Also Read: వారాహీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం - విశిష్టత, పూజా విధానం ఇక్కడ తెలుసుకోండి !

దేవతా శక్తులే 

మహాభారత జూదంలో ఓడిపోయిన పాండవులు అజ్ఞాతవాసంలో భాగంగా ద్వైతవనానికి చేరుకుంటారు. ఆ సమయంలో ఓ పండితుడు ధర్మరాజు వద్దకు వెళ్లి సహాయం అడుగుతాడు...తనవద్దనున్న 'అరణి' (నిప్పు పుట్టించడానికి ఉపయోగపడే కొయ్య)ని ఒక మృగం తీసుకెళ్లిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇమ్మంటాడు. ఆ పనిపై వెళ్లిన సోదరులు ఎప్పటికీ రాకపోవడంతో వాళ్లని వెతుక్కుంటూ వెళతాడు ధర్మరాజు.  ఓ సరస్సు దగ్గర పడిఉన్న సోదరులను చూసి నోరు పిడచగట్టుకుపోతుంది. అప్పుడు సరస్సులో నీరు తాగుతామని ప్రయత్నించగా ఓ యక్షుడి హెచ్చరిక విని ఆగిపోతాడు ధర్మరాజు. తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితేనే నీటిని తాగమని చెప్పడంతో సరే అన్న ధర్మరాజు  72 ప్రశ్నలకు సమాధానాలు చెబుతాడు. సాక్షాత్తూ యమధర్మరాజు యక్షుడి రూపంలో వచ్చి అడిగిన ఆ ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా పురాణాల్లో ఉన్నాయి.  

యక్ష ప్రశ్నలు 72.. వాటి సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి

యక్షిణులు ఎక్కడుంటారు?

పురాణాల ప్రకారం 14 లోకాలున్నాయి 
భూలోక, భువర్లోక, సువర్లోక, మహలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాలు...ఊర్థ్వలోకాలు
 అతల, వితల, సుతల, తలాతల, రసాతల ,మహాతల ,పాతాళ...ఇవి అథోఃలోకాలు..
వీటిలో భూమికి దగ్గరగా ఉన్న ఊర్థ్వలోకంలోనే యక్ష, యక్షిణిలు ఉంటారు. వీరి విధులన్నీ నిర్ణయించేది కుబేరుడే. 

Also Read: అశ్వత్థామ మంచివాడా - చెడ్డవాడా..అత్యంత శక్తిమంతుడైన బ్రాహ్మణ పుత్రుడికి ఎందుకీ శాపం!

యక్షిణిలు కనిపిస్తారా?

భూమ్మీద ఉండే మానవుల శరీరం పంచభూతాలతో తయారు చేసినది. యక్షుల శరీరం కేవలం మూడు భూతాలతో గాలి, నిప్పు, ఆకాశం వీటితో మాత్రమే తయారుచేసినది. అందుకే యక్షిణులు మానవులకు కనిపించరు. భూమిలోపల దాగి ఉన్న సంపదకు, గుప్త నిథులకు ఎవ్వరికీ కనిపించకుండా కాపలా కాస్తుంటారు. విలువైన సంపద ఉన్నదగ్గర యక్షిణులు పాముల రూపంలో ఉంటారని పురాణాల్లో చెబుతారు. 
 
పురాణాల్లో యక్షిణుల ప్రస్తావన

రామాయణం, మహాభారతం, బౌద్ధమతం, జైనమతంలోనూ యక్షిణులు, యక్ష గురించి ప్రస్తావన ఉంది. చాలా సంప్రదాయాల్లో యక్షిణులను పాజిటివ్ ఎనర్జీగా, దుష్టశక్తుల నుంచి కాపాడేవారిగా పూజిస్తారు. భూలోకంలో పుట్టినవారు ఎంతో పుణ్యం చేస్తే మరు జన్మలో యక్షులుగా మారుతారని  ఉద్దమరేశ్వర తంత్ర లో ఉంది.

యక్షిణి తంత్ర రహస్యం అనే పుస్తకం ప్రకారం...

నిర్జన ప్రదేశంలో అర్థరాత్రి సమయంలో ధైర్య సాహసాలతో  యక్షిణి మంత్రజపం చేయాలి. అప్పుడు మాత్రమే యక్షిణుల దర్శనం లభిస్తుందని శివుడు స్వయంగా పార్వతీ దేవితో చెప్పినట్టు యక్షిణి తంత్ర రహస్యం అనే పుస్తకంలో ఉంది.  ఏ సాధకుడు అయినా యక్షిణి దేవతలను మాతృరూపంగా కానీ, సోదరి రూపంగా గానీ, పుత్రిక రూపంగా కానీ, భార్య రూపంగా గానీ భావించి ధ్యానించవచ్చు. 

Also Read: ఈ ఆలయంలో 16 ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరుకుంటే 21 రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు!
 
హిందూ పురాణాల ప్రకారం

ఉద్దమరేశ్వర తంత్రంలో 36 మంది యక్షిణిలు, వారిని పూజించాల్సిన మంత్రాల గురించి ఉంది. భూమిలో దాగిఉన్న నిధికి రక్షణగా ఉండే యక్షిణిలు అక్కడి పరిస్థితులను బట్టి సత్వ, రజో, తమో గుణాలు కలిగి ఉంటారు. ఐశ్వర్యాన్ని ప్రసాదించే యక్షిణిలను పూజించాలి అనుకుంటే మంత్రోపదేశం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఉద్దమరేశ్వర తంత్రంలో పేర్కొన్న 36 మంది యక్షిణులలో ప్రధానమైనవాళ్లు వీళ్లే...

విచిత్ర - అందమైన  తెలివిగల యక్షిణి

హంసి - హంస రూపంలో తిరిగే ఈ యక్షిణిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి

విశాల - రావిచెట్టంత పొడుగ్గా ఉండే ఈ యక్షిణి రూపం రాక్షసిలా ఉంటుంది..ఈమెని పూజిస్తే సంపదను ప్రసాదిస్తుంది

మహేంద్రి - దీర్ఘకాలిక రోగాలు నయం చేసే శక్తి మహేంద్రికి ఉంది

కామేశ్వరి - అంతులేని సంపదను , రసవాద రహస్యాలను అందిస్తుంది ఈ యక్షిణి 
 
కర్ణపిశాచి - ఈమె తామస శక్తిగల యక్షిణి. ఎవరికి సంబంధించిన గత, వర్తమాన రహస్యాలను సిద్ధుల చెవిలో చెప్పేస్తుంది. ఈమెను వసపరుచుకోవడం అత్యంత కష్టం..చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. 
 
ఇంకా వికల ,మాలిని, శతపత్రిక , సులోచన , శోభ, కపాలిని సహా ఉద్దమరేశ్వర తంత్రంలో 36 మంత్రి యక్షిణుల పేర్లు వారిని పూజించే విధానం  ఉంది.

జైనమతంలో

అభిధానచింతామణి గ్రంధం ప్రకారం..జైనమతంలో పంచంగులి, చక్రేశ్వరి , జ్వాలామాలిని,బహు రూపిణి, పద్మావతి  సహా 25 మంది యక్షులు ఉన్నారు. వీళ్లంతా జైన దేవాలయాలను పరిరక్షిస్తుంటారు. వీళ్లనే  జైన తీర్థంకరుల సంరక్షక దేవతలుగా పరిగణిస్తారు.   

బౌద్ధమతంలో 

బౌద్ధమత గ్రంధాల ప్రకారం యక్షిణులు 69 మంది. భారుత్, సాంచి , మధుర ఈ మూడు ప్రదేశాల్లో ఉన్న బౌద్ధస్థూపాలపై యక్షిణుల బొమ్మలు చెక్కి ఉంటాయి. బౌధ్ద స్మారక కట్టడాల్లో అలంకారంగా ఉండే యక్షిణులు..ఆ తర్వాత కాలంలో సాలభంజికలుగా మారారు.  

ఇంకా చైనా, జపాన్, థాయిలాండ్, మయన్మార్ లో యక్షిణినులను ఆలయాలకు సంరక్షలుగా విశ్వశిస్తారు..

Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!

యక్షిణులు మంచివాళ్లా - చెడ్డవాళ్లా!

యక్షిణిలు కేవలం అర్థరాత్రి మాత్రమే సంచిరిస్తుంటారు..అందుకే వీరిని నెగిటివ్ ఎనర్జీగా భావిస్తారు. ఆసమయంలో వీరికి ఎదురుపడితే చెడు జరుగుతుందని చెబుతారు. అయితే యక్షిణులు చెడ్డవారు కాదు...మంచివాళ్లనీ చెప్పలేం. సాధకులు, సిద్ధులు, పూజించేవారి మనసులో కోర్కెల ఆధారంగా యక్షిణుల ప్రవర్త ఆధారపడి ఉంటుంది.  యక్షిణులను ప్రశన్నం చేసుకోవాలంటే అది తాంత్రిక పూజ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.  శ్మశానాల్లో, నదీ ప్రవాహంలో, అర్థరాత్రి మర్రిచెట్టు కింద..ఇలా ఒ‍క్కో యక్షిణి పూజా విధానం ఒక్కోలా ఉంటుంది.  సక్రమంగా చేస్తే అద్భుత ఫలితాలను పొందుతారు..అనుసరించే విధానంలో ఏదైనా తేడా ఉంటే వెంటనే అందుకు తగిన శిక్షతప్పదు. ఓవరాల్ గా చెప్పాలంటే యక్షిణి ఆరాధన అంత సులభం కాదు. 


 

Continues below advertisement