Telangana Schools ABVP Bandh: తెలంగాణలోని పాఠశాలలు జూన్ 24న మూతపడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల అక్రమ ఫీజులను అరికట్టి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. పాఠశాల విద్యలో నెలకొన్న ఇతర సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ జూన్ 26న పిలుపునిచ్చి పాఠశాలల బంద్‌కు అందరూ సహకరించాలని కోరింది. ఈ నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలు జూన్ 26న సెలవు ప్రకటించాయి.
 
రాష్ట్రంలో డీఈఓ, ఎంఈఓ పోస్టులు భర్తీ చేయకుండా పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో చెప్పాలని ఏబీవీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. నిబంధనలకు విరుద్దంగా ప్రైవేట్, కార్పోరేట్ పాఠాశాలల యాజామాన్యాలు బుక్స్ యూనిఫామ్స్ అమ్ముతున్నాయని.. ఆయా స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ABVP కోరుతోంది. పర్మిషన్స్ లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూల్స్‌పై చర్యలు తీసుకోవాలని సూచించింది.  ఈ నెల 26న జరిగే స్కూళ్ల బంద్​కు మేనేజ్ మెంట్లు సహకరించాలని…  స్వచ్చందంగా పాఠశాలలు బంద్ చేయాలని కోరారు. 


15 రోజులు కావస్తున్నా.. అందని పుస్తకాలు...
రాష్ట్రంలోని పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత జూన్ 13న తిరిగి తెరచుకున్నాయి. స్కూల్స్‌ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు పుస్తకాల పంపిణీ పూర్తి కాలేదు. అలానే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్క పద్దతి అనేదే లేకుండా భారీగా ఫీజులు పెంచాయని ఏబీవీపీ ఆరోపించింది. రాష్ట్రప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయడంతోపాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.  


2024-25 అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం...


➥ ఈ ఏడాది జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. 2025 ఏప్రిల్‌ 23తో విద్యాసంవత్సరం ముగియనుంది. 


➥ ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.


➥ 2025 ఏప్రిల్‌ 24 నుంచి 2025 జూన్‌ 11 వరకు 49 రోజులపాటు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.


➥ 2025 జనవరి 10న పదో తరగతి సిలబస్‌ పూర్తిచేసి, పబ్లిక్ పరీక్షలలోపు రివిజన్‌ క్లాసులు, ప్రీ ఫైనల్‌ పరీక్షలు పూర్తిచేయనున్నారు.


➥ ఇక 1వ తరగతి  నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను 2025 ఫిబ్రవరి 28 లోపు పూర్తిచేసి, 2025 ఏప్రిల్‌లో నిర్వహించే ఎస్‌ఏ-2 పరీక్ష కోసం రివిజన్‌, రెమెడియల్‌ టీచింగ్‌, ప్రిపరేషన్‌ నిర్వహించనున్నారు.


➥ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రార్థన అనంతరం అన్ని తరగతుల్లో 5 నిమిషాలపాటు యోగా, ధ్యానం తరగతులు ఉండనున్నాయి. 


➥ ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ 2 నుంచి 14 వరకు 13 రోజుల పాటు ఉండనున్నాయి. ఇక సంక్రాంతి సెలవులు 2025 జనవరి 13 నుంచి 17 వరకు మొత్తం 5 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇక డిసెంబ‌ర్ 23 నుంచి 27 వ‌ర‌కు క్రిస్మ‌స్ సెల‌వులు ఇవ్వనున్నారు.


పరీక్షల షెడ్యూలు ఇలా..


➥ ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-1 పరీక్షలను ఈ ఏడాది జులై 31 నాటికి నిర్వహించనున్నారు.


➥ ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-2 పరీక్షలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి నిర్వహించనున్నారు.


➥ సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-1 పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి 28 వరకు, ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-3 పరీక్షలను ఏడాది డిసెంబర్‌ 12 లోపు, ఫార్మాటివ్‌ అసెస్‌మెంట్‌ (FA)-4 పరీక్షలను 2025 జనవరి 29 లోపు పూర్తిచేయనున్నారు.


➥ సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (SA)-2 పరీక్షలను 2024 ఏప్రిల్‌ 9 నుంచి 2024 ఏప్రిల్‌ 29 వరకు (1 నుంచి 9 తరగతులకు), ప్రీ ఫైనల్‌ (10వ తరగతి) పరీక్షలను 2024 ఫిబ్రవరి 28లోపు నిర్వహించనున్నారు.


➥ ఇక పదోతరగతి వార్షిక పరీక్షలను 2025 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్నారు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి..