Weekly Horoscope 03 To 09 March 2025: మార్చి 03 నుంచి మార్చి 09 వరకూ వారఫలాలు
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope 03 march to 09 march 2025)
ధనస్సు రాశివారి ఆశయాలన్నీ నెరవేరుతాయి. కుటుంబంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఓ కొలిక్కివస్తాయి. మీ మాటతీరుకి అంతా ప్రభావితులవుతారు.ఓ కష్టమైన పనిని ఈ వారం నెరవేర్చుకుంటారు. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. విదేశాలలో వ్యాపారం చేసే వ్యక్తులకు కొన్ని సమస్యలు తప్పవు. తోబుట్టువులతో వివాదం చెలరేగే అవకాశం ఉంది. ఇంట్లో కొన్ని వైరుధ్యాలు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు అనవసరమైన పనులలో సమయాన్ని వృథా చేయవచ్చు. ముఖ్యమైన సమస్యలపై తక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోండి.
Also Read: ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు చేసేందుకు ఈ 4 రాశులవారికి మార్చి మొదటివారం మంచిది!
మకర రాశి (Capricorn Weekly Horoscope 03 march to 09 march 2025)
మార్చి 3 నుంచి మార్చి 9 వరకూ ఈ వారం మకర రాశివారికి అదృష్టం కలసొస్తుంది. ఇంటి వాతావరణం క్రమశిక్షణలో ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. మీరున్న రంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. సమస్యలను ప్రశాంతంగా సాల్వ్ చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. పనిపట్ల మీకున్న అంకితభావం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. నూతన ఆర్థిక మూలాలు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. అనవసరమైన చర్చలు , వివాదాల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచండి. ఇది మీ దృష్టిని బలహీనపరుస్తుంది. పిల్లల సమస్యలను వినండి..ఆ సమస్యల నుంచి వారిని బయటపడేసేందుకు ప్రయత్నించండి.
Also Read: Monthly Horoscope for March 2025 : మార్చి నెల ఈ ఏడు రాశులవారికి అంతా అనుకూలం, ఆర్థిక లాభం!
కుంభ రాశి (Aquarius Weekly Horoscope 03 march to 09 march 2025)
మార్చి మొదటివారం కుంభరాశివారు ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పిల్లలతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. తక్కువ ప్రయత్నంతోనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్ట్ ఫీల్డ్‌తో సంబంధం ఉన్నవారికి గౌరవం లభిస్తుంది. సాంకేతిక సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకోని వ్యక్తుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కోవలసి ఉంటుంది. వారం మధ్యలో పాత తప్పుల కారణంగా మీరు ఇబ్బందిని ఎదుర్కోవలసి ఉంటుంది. వైవాహిక జీవితంలో మీరు ఏదో లోపం ఉన్నట్టు భావిస్తారు.
Also Read: Ugadi 2025 : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!
మీన రాశి (Pisces Weekly Horoscope 03 march to 09 march 2025)
గత కొంతకాలంగా వెంటాడుతున్న చిక్కుముడుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ ధైర్యం పెరుగుతుంది. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు ప్రయోజనం చేకూర్చడంలో ముందుంటారు. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి వారం. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. ఈ వారం ముఖ్యమైన ఒప్పందాలకు చాలా మంచిది. మీ నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేముందు అనుభవజ్ఞులను సంప్రదించండి. మీ ఆలోచనలను, అభిప్రాయాలను ఎవరిపైనా రుద్దొద్దు. ఆహారం, అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి
Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన ఫలితాలివి. మీ వ్యక్తిగత రాశిచక్రం ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..