Weekly Horoscope 03 To 09 March 2025: మార్చి 03 నుంచి మార్చి 09 వరకూ వారఫలాలు


మేష రాశి (Aries  Weekly Horoscope) 


ఈ వారం మీ ధైర్యం పెరుగుతుంది. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు మేధో నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రాశివారు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. విద్యార్థులుకు ఉన్నత విద్యలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ పరిచయాలను బాగా ఉపయోగించుకుంటారు. వారం ఆరంభంలో కన్నా మధ్యలో మీకు టైమ్ కలిసొస్తుంది. అధిక కోపం కారణంగా నష్టపోతారు. ఉద్యోగం, వ్యాపారంలో ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా పూర్తిచేస్తారు.


Also Read: Monthly Horoscope for March 2025 : మార్చి నెల ఈ ఏడు రాశులవారికి అంతా అనుకూలం, ఆర్థిక లాభం!


వృషభ రాశి (Taurus  Weekly Horoscope)


మార్చి 3 నుంచి 9 వరకూ ఈ రాశివారు ఆస్తుల కొనుగోలు, అమ్మకాల గురించి ఆలోచిస్తారు. ఈ వారంలో జరిగే ఆర్థిక లావాదేవీల్లో లాభం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అత్సుత్సాహంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. రియల్ ఎస్టేట్ సంబంధిత వ్యాపారాల్లో ఉండేవారు నష్టపోతారు. నూతన ప్రాజెక్టులు చేపట్టేవారు గందరగోళానికి గురవుతారు. కోపంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. కృషికి తగిన ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాల్లో యాక్టివ్ గా ఉంటారు.   


Also Read: Ugadi 2025 : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!


మిథున రాశి (Gemini  Weekly Horoscope) 


మార్చి మొదటివారం మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. రాజకీయాలతో సంబంధం ఉండేవారు ఉన్నత స్థానం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారు నూతన బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. చెడిపోయిన సంబంధాలను తిరిగి పొందడంలో మీరు విజయవంతమవుతారు. ఈ వారం మీకు  తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టుల విషయంలో ఉత్సాహంగా ఉంటారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేస్తాయి. పొట్టకు సంబంధించిన అనారోగ్య సమస్యలుంటాయి. 


కర్కాటక రాశి (Cancer  Weekly Horoscope)  


ఈ వారం కర్కాటక రాశివారికి మంచి ఫలితాలు వస్తాయి. పెద్దల ఆశీర్వాదాలు మీపై ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉండే వివాదాలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులు కెరీర్ కి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ఈ వారం ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన చేయవచ్చు. అసంపూర్ణ పనులను పూర్తి చేయడానికి ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు పడుతుంది..పెద్దలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.  


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన ఫలితాలివి. మీ వ్యక్తిగత రాశిచక్రం ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..