Monthly Horoscope for March 2025
వృషభ రాశి (Taurus Monthly Horoscope for March 2025)
మార్చి నెల ఈ రాశివారికి అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలున్నాయి. మీ అనుభవాన్ని, నైపుణ్యాన్ని బాగా ఉపయోగించుకోగలుగుతారు. మీ లక్ష్యాలపట్ల విధేయత చూపండి. కుటుంబంలో ప్రేమ, సామరస్య పూర్వక వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత ఉంటుంది. ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ నిపుణులకు ఈ నెల చాలా మంచిది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. గృహనిర్మాణ ప్రయత్నాలు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సంతోషంగా ఉంటారు.
Also Read: ఈ మూడు రాశులవారికి మార్చి నెలలో ఊహించని సమస్యలు తప్పవు!
మిథున రాశి (Gemini Monthly Horoscope for March 2025)
మార్చి నెల మిథున రాశివారికి బాగా కలిసొస్తుంది. ఈ నెల ఆర్థికంగా లాభపడతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు ముబ్బులు విడినట్టు విడిపోతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. రాజకీయనాయకులు లాభపడతారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. చట్టపరమైన కేసుల విషయంలో విజయం సాధిస్తారు. ఈ నెలలో అప్పులు ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రాజెక్టులలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటారు. ఆహారంలో స్వచ్ఛత ఉండేలా చూసుకోండి. శరీరానికి తగినంత నిద్ర అవసరం.
కర్కాటక రాశి (Cancer Monthly Horoscope for March 2025)
ఈ నెలలో కర్కాటక రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటుంది. గృహనిర్మాణ పనులు కలిసొస్తాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. సంఘంలో పెద్దవారిని కలుస్తారు. ప్రయాణంలో లాభపడతారు. నూతన పరిచయాల వల్ల లాభపడతారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ నెల అనుకూలం. ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలిస్తారు. నెల ప్రారంభం మీకు అంత శుభం కాదు. అవివాహితులు వివాహం గురించి ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది.
కన్యా రాశి (Virgo Monthly Horoscope for March 2025)
కన్యారాశివారికి మార్చి నెల బాగా కలిసొస్తుంది. ఈనెలలో చేపట్టిన ప్రతి పనిలో మంచి ఫలితాలు పొందుతారు. మనశ్సాంతి ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. కెరీర్ పరంగా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఈ నెల ఉత్సాహంగా సాగిపోతుంది. స్నేహితులతో కలసి టూర్ ప్లాన్ చేసుకుంటారు. బలహీనతలు అధిగమించేందుకు ప్రయత్నించండి. వైవాహిక సంబంధాల్లో సాన్నిహిత్యం ఉంటుంది. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో మహిళలకు అనారోగ్య సమస్యలుంటాయి. నెలలో చివరి వారం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారంలో మీ భాగస్వాముల ప్రయోజనాలను జాగ్రత్తగా చూసుకోండి.
తులా రాశి (Libra Monthly Horoscope for March 2025)
ఈ నెలలో వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారి కల ఫలిస్తుంది. దిగుమతి ఎగుమతి వ్యాపారాల్లో లాభాలు ఆర్జిస్తారు. ఈ రాశి రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. అన్నీ కలిసొస్తాయి కానీ అదిక కోపం కారణంగా అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. బంధుమిత్రులతో విరోధాలు పెట్టుకుంటారు. స్త్రీ మూలకంగా ధనం పొందుతారు. వ్యాపారులు ఆశించిన లాభాలు ఆర్జించలేరు. చేతులు, కాళ్లు నొప్పులతో ఇబ్బందిపడతారు. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సాంకేతిక రంగంలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.
వృశ్చిక రాశి (Scorpio Monthly Horoscope for March 2025)
వృశ్చిక రాశివారికి మార్చి నెల అన్నివిధాలుగా యోగకాలం. చేపట్టిన కార్యాల్లో లాభపడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం పెరుగుతుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సాహిత్యం, కళల పై ఆసక్తి పెరుగుతుంది. న్యాయవాద వృత్తిలో ఉండేవారికి ఈ నెలలో మంచి జరుగుతుంది. స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. భూ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. నూతన పరిచయాలు లాభిస్తారు. ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గొంతు వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు సంబంధించిన సమస్యలుంటాయి.
కుంభ రాశి (Aquarius Monthly Horoscope for March 2025)
కుంభ రాశివారికి మార్చి నెలలో గ్రహాల అనుకూలత ఉంటుంది. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలుంటాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో మంచి విజయం సాధిస్తారు. వ్యాపార లావాదేవీలు కలిసొస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఆదాయానికి లోటుండదు. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. పిల్లల ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు. అబద్ధాలు చెప్పొద్దు. చెడు వ్యక్తులతు దూరంగా ఉండాలి. కోపం తగ్గించుకోవాలి. భార్య భర్త మధ్య అనుకూలత ఉంటుంది
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!