Monthly Horoscope for March 2025 


మేష రాశి (Aries Monthly Horoscope for March 2025)


మార్చి నెల మేష రాశివారికి అంత అనుకూల ఫలితాలు లేవు. అనుకోని ధనవ్యయం ఉంటుంది.  ఆస్తి వివాదాలు ఉంటాయి.  వ్యసనాలబారిన పడతారు. తండ్రితరపు వారినుంచి చెడువార్త వింటారు. నూతన ఉద్యోగంలో చేరేవారికి ఒత్తిడి ఉండదు. ప్రేమ వివాహాలకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతి పొందుతారు. కుటుంబంలో శుభకార్యం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తారు. పిల్లల ప్రవర్తనతో బాధపడతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, బంధువుల నుంచి సహాయం పొందుతారు. మొండి పట్టుదల వీడండి. 


సింహ రాశి (Leo Monthly Horoscope for March 2025)


సింహ రాశివారికి ఈ నెలలో పరిస్థితులు అంత అనుకూలంగా ఉండదు. ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. అకాల భోజనం, శారీరక శ్రమ తప్పదు. కుటుంబంలో అందరితో విరోధాలు ఉంటాయి. మానసిక సమస్యలుంటాయి. జీవిత  భాగస్వామి నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తారు. వాహనాన్ని మారుస్తారు. ఉద్యోగులకు బదిలీ తప్పదు. శత్రువులు పొంచి ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. మీ సామర్థ్యం కన్నా ఎక్కువ ఖర్చు చేయవద్దు. వ్యాయామానికి సమయం కేటాయించాలి.


ధనస్సు రాశి ((Sagittarius Monthly Horoscope for March 2025)


మార్చి నెలలో ధనస్సు రాశివారికి అన్నీ అనుకూల ఫలితాలే. చేపట్టిన ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. ఆరోగ్యం బావుంటుంది. ధైర్యంగా ఉంటారు.  ఉద్యోగం మార్పు గురించి ఆలోచిస్తారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఈనెలలో పూర్తిచేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులున్నా సమసిపోతాయి. కుటుంబ సభ్యులపై అనవసర కోపం ప్రదర్శించవద్దు. అధిక పని ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకుంటారు. 


మకర రాశి (Capricorn Monthly Horoscope for March 2025)


ఈ నెలలో గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉండడంతో ఏ పనిచేసినా లాభిస్తుంది. అన్నింటా మీదే పైచేయి అవుతుంది. ఆర్థికంగా బావుంటుంది. ధైర్యంగా దూసుకెళ్తారు. అవదు అనుకున్న పనిని కూడా మొండిగా చేసేస్తారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మకరం ప్రజలు వారి కృషి మరియు సామర్ధ్యాలను బాగా ఉపయోగించగలరు. మీరు ఇంటర్వ్యూ మొదలైన వాటిలో చేరితే మీరు విజయం సాధించవచ్చు.విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి ఈ నెలలో సమయం కలిసొస్తుంది. ఉద్యోగులు ఉన్నాతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఫైనాన్స్ రంగంలో ఉండేవారు లాభాలు ఆర్జిస్తారు. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 


మీన రాశి  (Pisces Monthly Horoscope for March 2025)


మీన రాశివారికి మార్చిలో గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉండడంతో ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది. ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆస్తి సంబంధిత కేసులు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు ఈ నెలలో మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమయాన్ని వృధా చేయొద్దు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడతాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. 


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


Also Read: స్నానం ఎన్నిరకాలు.. నిత్యం చేసే స్నానానికి, దివ్య స్నానానికి ఏంటి వ్యత్యాసం!