మార్చి 02 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మీరు చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ వ్యవహారాల్లో అడ్డంకులు ఉంటాయి. కోపానికి దూరంగా ఉండండి. అనవసర వివాదాల్లో చిక్కుకోద్దు. ఎగుమతి-దిగుమతి సంబంధిత వ్యాపారాల్లో మంచి లాభాలు ఆర్జిస్తారు. 


వృషభ రాశి


ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో భారీ మార్పులు చేస్తారు. సృజనాత్మకంగా ఆలోచిస్తారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో అడుగు ముందుకు పడుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు శుభసమయం. రోజంతా ఆనందంగా ఉంటారు


మిథున రాశి


ఈ రోజు మీరున్న రంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యర్థ ఖర్చులు నియంత్రించండి. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేస్తారు. అన్ని పనులు సులభంగా పూర్తవుతాయి.


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!
 
కర్కాటక రాశి


ఈ రోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారంలో పెద్ద ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. అధికారుల నమ్మకం మీపై కొంచెం తక్కువగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. 


సింహ రాశి


ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులు రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి. మొండి వైఖరి కారణంగా నష్టం భరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవడం సముచితం.


కన్యా రాశి


ఈ రోజు మీరు అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో ఖర్చులు నియంత్రించేందుకు ప్రయత్నిస్తారు. కన్నవారి ప్రవర్తనపై కొంత అసంతృప్తిగా ఉంటారు. ఒత్తిడి తగ్గుతుంది. ఈ రోజు మీరు అనుకోని ప్రయామం చేయాల్సి వస్తుంది.  ఎవరి పనిలోనూ జోక్యం చేసుకోకండి. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ పెరుగుతుంది.


తులా రాశి


ఈ రాశి ఉద్యోగులపై ఉన్నతాధికారులు కోపంగా ఉంటారు. ఆ కోపాన్ని సహోద్యోగులపై చూపించవద్దు. క్షీణిస్తున్న సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించండి. అనారోగ్య సమస్యలుంటాయి. ఆధ్యాత్మిక విషయాల కోసం ఖర్చులు చెస్తారు.  


వృశ్చిక రాశి


ఈ రోజు మీరు ఏదో విషయంలో కలత చెందుతారు. ప్రేమ కంటే ప్రేమ సంబంధాలలో ప్రదర్శన ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల నుంచి మీరు ఆశించిన సహాయం అందదు. అప్పిచ్చిన డబ్బు తీర్చేందుకు ఇబ్బందిపడతారు. ఓ పెద్ద విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. 


Also Read: Ugadi 2025 : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రానికి ఎన్ని సున్నాలు ఉన్నాయి.. ఉంటే ఏమవుతుంది!


ధనస్సు రాశి


ఈ రోజు మీ ప్రణాళికలు  అమలవుతాయి. సహోద్యోగుల నుంచి ఉద్యోగులకు సహకారం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేయాలనే ఆలోచనలో ఉంటారు. కోపం తగ్గించుకోకుంటే తీవ్రంగా నష్టపోతారు. 


మకర రాశి


నిరుద్యోగులు ఈ రోజు మంచి ఉద్యోగం పొందుతారు. అనారోగ్య సంబంధిత సమస్యలపై ఆందోళన చెందుతారు. పిల్లలతో మంచి సమయం గడుుతారు. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ఒత్తిడి తగ్గుతుంది.


కుంభ రాశి


ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఇరుక్కుపోతారు. వివాహ జీవితంలో ప్రేమ పెరుగుతుంది. తల్లిదండ్రుల సలహా తీసుకోవడం మంచిది. రిస్క్ తీసుకునే ఆలోచనేవద్దు. వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంది. ఎవరితోనూ వాదించవద్దు.


మీన రాశి


మీ పనులన్నీ అంతరాయం లేకుండా పూర్తవుతాయి. మానసికంగా బలంగా అనిపిస్తుంది. కళా ప్రపంచంతో సంబంధం ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు.  మీ సలహా నుంచి చాలామంది ప్రయోజనం పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.