BOI Apprentices: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.800. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. సరైన అర్హతలు గల అభ్యర్ధులు మర్చి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, టెస్ట్ అఫ్ లోకల్ లాంగ్వేజ్ ఆధారంగా అప్రెంటిస్‌‌ల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు బిహార్, చత్తస్గఢ్, దిల్లీ, గుజరాత్, ఝార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ జోన్లలో శిక్షణ ఇస్తారు. 

వివరాలు..

* అప్రెంటిస్‌ పోస్టులు

మొత్తం సీట్ల సంఖ్య: 400

కేటగిరీల వారీగా/జోన్ల వారీగా ఖాళీలు..

⏩ బీహార్ రాష్ట్రం➥ ముజఫర్‌పూర్: 10 సీట్లు➥ శివన్: 19 సీట్లు

⏩ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం➥ రాయ్‌పూర్: 05 సీట్లు

⏩ గుజరాత్ రాష్ట్రం➥ అహ్మదాబాద్: 23 సీట్లు➥ రాజ్‌కోట్: 13 సీట్లు➥ వడోదర: 12 సీట్లు

⏩ జార్ఖండ్ రాష్ట్రం➥ బొకారో: 10 సీట్లు➥ ధన్‌బాద్: 14 సీట్లు➥ హజారీబాగ్: 06 సీట్లు

కర్ణాటక రాష్ట్రం➥ బెంగళూరు: 06 సీట్లు➥ హుబ్లీ-ధార్వాడ్: 06 సీట్లు

⏩ కేరళ రాష్ట్రం➥ తిరువనంతపురం: 05 సీట్లు

⏩ మధ్యప్రదేశ్ రాష్ట్రం➥ భోపాల్: 10 సీట్లు➥ ధార్: 10 సీట్లు➥ ఇండోర్: 05 సీట్లు➥ జబల్పూర్: 05 సీట్లు➥ ఖాండ్వా: 12 సీట్లు➥ ఉజ్జయిన్: 20 సీట్లు

⏩ మహారాష్ట్ర రాష్ట్రం➥ ముంబయి నార్త్: 08 సీట్లు➥ నాగ్‌పూర్: 11 సీట్లు➥ నవీ ముంబయి: 05 సీట్లు➥ పూణె: 16 సీట్లు➥ రాయగడ: 04 సీట్లు➥ రత్నగిరి: 08 సీట్లు➥ షోలాపూర్: 10 సీట్లు➥ విదర్భ: 05 సీట్లు

⏩ ఒడిశా రాష్ట్రం➥ కియోంఝర్: 09 సీట్లు

⏩ రాజస్థాన్ రాష్ట్రం➥ జైపూర్: 08 సీట్లు➥ జోధ్పూర్: 10 సీట్లు

⏩ తమిళనాడు రాష్ట్రం➥ చెన్నై: 07 సీట్లు

⏩ త్రిపుర రాష్ట్రం➥ గువహటి: 07 సీట్లు

⏩ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం➥ ఆగ్రా: 10 సీట్లు➥ హార్డోయ్: 26 సీట్లు➥ వారణాసి: 07 సీట్లు

⏩ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం➥ హౌరా: 06 సీట్లు➥ కోల్‌కతా: 18 సీట్లు➥ సిలిగురి: 28 సీట్లు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హతను కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.01.2025 నాటికి 20 - 28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.400. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, టెస్ట్ అఫ్ లోకల్ లాంగ్వేజ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

స్టైపెండ్‌: నెలకు రూ.12,000.

రాత పరీక్ష విధానం: పరీక్షకు 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్(25- ప్రశ్నలు, 25- మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ (25- ప్రశ్నలు, 25- మార్కులు), కంప్యూటర్ పరిజ్ఞానం (25- ప్రశ్నలు, 25- మార్కులు) ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు..

🔰 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2025. 

🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.03.2025.

Notification

Online Application

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..