Weekly Horoscope 03 To 09 March 2025: మార్చి 03 నుంచి మార్చి 09 వరకూ వారఫలాలు


సింహ రాశి (Leo  Weekly Horoscope 03 To 09 March 2025)


ఈ వారం మీకు అనుకూల ఫలితాలుంటాయి. ఇతరుల సలహాలను పరిగణలోకి తీసుకోవడం మంచిదే కానీ మీదే అంతిమ నిర్ణయం కావాలి.  ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాన్ని వృద్ధి చేసేందుకు నూతన భాగస్వాములను ఏర్పరుచుకుంటారు. ఈ రాశి ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. ఎప్పటి  నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ఒకేసారి చాలా పనులు చేయవద్దు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయవద్దు.


కన్యా రాశి  (Virgo  Weekly Horoscope 03 To 09 March 2025)


మార్చి 3 సోమవారం నుంచి మార్చి 09 ఆదివారం వరకూ కన్యారాశివారికి మంచి ఫలితాలుంటాయి. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. ఈ వారం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవారికి కలిసొస్తుంది.  ఉద్యోగంలో, సహోద్యోగులతో సమన్వయం మంచిది. పాత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం , వ్యయంలో సమతుల్యత ఉంటుంది. కొత్త ఆలోచనలు మనస్సులో పుడతాయి. ఇంటా బయటా మీకు గౌరవం పెరుగుతుంది.  సమస్యను పరిష్కరించడం వల్ల మీకు రిలాక్స్డ్ గా ఉంటుంది. తోబుట్టువులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్ పరంగా ఈవారం మీకు మంచి జరుగుతుంది. రహస్య శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.  ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాంకింగ్ వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులపై పని ఒత్తిడి పెరుగుతుంది. ఎవరైనా వస్తువులను కొనుగోలు చేస్తే లేదా విక్రయిస్తే అవసరం అయిన బిల్లుల విషయంలో నిర్లక్ష్యం వద్దు.


తులా రాశి (Libra  Weekly Horoscope 03 To 09 March 2025)


తులా  రాశివారికి మార్చి మొదటివారంలో ఆర్థిక ప్రయోజనాలుంటాయి. పెద్ద కంపెనీలలో ఉద్యోగాలకు హాజరవుతారు. అవివాహితులకు మంచి సంబంధం కుదురుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ నైపుణ్యాల ఆధారంగా మద్దతు పొందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపిస్తారు. వారం ఆరంభంలో కన్నా వారాంతంలో మంచి ఫలితాలు పొందుతారు. మీకున్న పరిచయాలను సరిగ్గా ఉపయోగించుకోలేరు. పైనాన్స్ సంబంధిత కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ బంధం మధ్యలోకి అపార్థాలను రానివ్వవద్దు. పొట్టకు  సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి.  


వృశ్చిక రాశి (Scorpio   Weekly Horoscope 03 To 09 March 2025)


మార్చి మొదటివారం మీకు మంచి ఫలితాలుంటాయి. మీ ఆధిపత్యం పెరుగుతుంది. పిల్లల్ని చూసి గర్వపడతారు. యంత్రాలకు సంబంధించిన వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ప్రచార ప్రమోషన్ ఈ వారం చూడవచ్చు. మీరు చిన్న తరహా పరిశ్రమలలో విజయం సాధిస్తారు. ఫీల్డ్‌లో మీ స్థానం బలంగా ఉంటుంది. చిక్కుకుపోయిన కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యూహాత్మక ఆలోచనల ప్రభావం మీపై ఉంటుంది. పాతసంబంధాలు మీపై ప్రభావం చూపిస్తాయి. ఆచితూతి మాట్లాడండి. వ్యక్తిగత సంబంధాలను బహిరంగపరచడం సముచితం కాదు.


Also Read: 2025లో ఉగాది ఎప్పుడొచ్చింది - రాబోతున్న తెలుగు నూతన సంవత్సరం పేరు తెలుసా!


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన ఫలితాలివి. మీ వ్యక్తిగత రాశిచక్రం ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.  వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..