వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో ఎంపీపీ పదవులు చిచ్చు రేపాలు పలు చోట్ల ఎంపీటీసీలు తమకు పదవులు దక్కలేదని అసంతృప్తికి గురయ్యారు. ఓ చోట వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చేయాలని ప్రయత్నించగా.. ఇంకో చోట సమావేశంలోనే ఎంపీటీసీ పురుగుమందు తాగడం సంచలనాత్మకం అయింది. కర్నూలు జిల్లా గూడూరు మండలం కె.నాగలాపురంలో ఎంపీపీ పదవి తన తల్లికే ఇవ్వాలంటూ ఎంపిటిసి రాజమ్మ తనయుడు నరసింహారెడ్డి నిరాహారదీక్, చేస్తున్నారు.  అధిష్ఠానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఉద్వేగానికి గురై వైఎస్సార్ విగ్రహం కూల్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని దీక్షను భగ్నం చేసి నరసింహ రెడ్డిని అరెస్టు చేశారు. Also Read : టీటీడీలో కొత్త వివాదం ! "జియో మార్ట్‌"కు శ్రీవారి దర్శన టిక్కెట్ల బుకింగ్ కాంట్రాక్ట్ !


కోడుమూరు నియోజకవర్గంలోని  సి.బెళగల్‌ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సి.బెళగల్‌-2 ఎంపీటీసీ వైకాపా అభ్యర్థి ఈరన్న గౌడ్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.   గమనించిన పోలీసులు, స్థానికులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు హుటాహుటిన ఎస్సై వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  అయితే ఈరన్న గౌడ్ తనకు ఎంపీపీ పదవి కోసం కాకుండా కో ఆప్షన్ మెంబర్‌గా చాన్సివ్వాలని కోరారు. అయినా ఇవ్వకపోవడంతో పురుగుమందు తాగారు.


Also Read : బీసీ సంక్షేమం కిందకు బ్రాహ్మణ కార్పొరేషన్ ! ప్రభుత్వం చెబుతున్న కారణాలేంటి ? విమర్శలు ఎందుకు వస్తున్నాయి ?


ఇక  శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు వరకు అనేక చోట్ల వైఎస్ఆర్ సీపీ ద్వితీయ శ్రేణి నేతల మధ్య పొసగని కారణంగా ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. కొన్నిచోట్ల వాయిదా పడ్డాయి. వివాదం ఉన్న చోటల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుంది. సీల్డ్ కవర్‌లో అభ్యర్థుల పేర్లను పంపింది. అయితే ఆ పేర్లు తమకు ఇష్టం లేదని కొన్ని చోట్ల ఓటింగ్‌కు ఎంపీటీసీలు హాజరు కాలేదు. మరో వైపు తమకు ఆధిక్యం లేని చోట కూడా మండల పరిషత్ పదవులు దక్కించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించడం వివాదాస్పదం అయింది. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైఎస్ఆర్ సీపీకి మెజార్టీ లేదు. అయితే టీడీపీ తరపున ఎంపీపీ చైర్మన్ స్థానానికి పోటీ పడాల్సిన వారికి బీసీ సర్టిఫికెట్ దక్కనీయలేదు. దాంతో టీడీపీ ఎంపీటీసీలు గైర్హాజర్ అయ్యారు. ఎంపిక వాయిదా పడింది. 


Also Read: AP CM Jagan : ఢిల్లీ టూర్‌కు జగన్ కూడా !? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే అవకాశం !


మరో వైపు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. అలాగే ఎంపీపీ పదవుల్ని కూడా కైవసం చేసుకున్నాయి. టీడీపీకి చైర్మన్ పదవి.. జనసేనకు వైస్ చైర్మన్ పదవి దక్కాయి. అత్యధిక మండల చైర్మన్ పీఠాలు వైఎస్ఆర్‌సీపీకే దక్కాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఆధిపత్య పోరాటం ప్రారంభమయింది. 


Also Read: CM Jagan Review: మద్యం నియంత్రణకే రేట్లు పెంపు... ఎస్ఈబీపై సీఎం జగన్ రివ్యూ... ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి