బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలోకి కలుపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ప్రభుత్వం ఇలా గెజిట్ జారీ చేసిన వెంటనే అలా సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ కిందకు తీసుకు రావాలన్న డిమాండ్ ఎవరూ చేయలేదు. ఎవరికీ అలాంటి ఆలోచన కూడా రాలేదు. కానీ ప్రభుత్వానికి వచ్చింది. ఉత్తర్వులు జారీ చేసే వరకూ బయట ప్రపంచానికి తెలియదు. 


బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖ కిందకు చేర్చడానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. బీసీ కార్పొరేషన్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పథకాల్లో భాగంగా నిధులను ఆయా వర్గాల కార్పొరేషన్లకు జమ చేసి.. వెంటనే పథకం కోసం మళ్లిస్తున్నారు.  బ్రాహ్మణ కార్పొరేషన్ లోనూ అంతే. పేపర్ మీద నిధుల కేటాయింపు చూపి వెంటనే బదిలీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బ్రాహ్మణ కార్పొరేషన్ దేవాదాయ శాఖ కింద ఉంది. ఇలా పథకాల కోసం నిధులు కేటాయించి వెంటనే మళ్లించడానికి దేవాదాయ శాఖ ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తోంది. దేవాదాయ శాఖ ఇస్తున్న ఉత్తర్వుల వల్ల భక్తుల సొమ్మును పథకాలకు  వాడుకుంటున్నారన్న అనుమానాలకు కారణం అవుతోంది. కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు. అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను దేవాదాయ శాఖ నుంచి తప్పిచాలని నిర్ణయించారు. కానీ ఎక్కడ కలపాలో తెలియ బీసీ సంక్షేమ శాఖ కిందకు కలిపేశారు.


Also Read : ఏపీలో దాష్టీక పాలన.. క్షేత్రస్థాయి పోరాటాలకు జనసేన సిద్ధం: పవన్‌ కల్యాణ్‌


బీసీల్లో లేని బ్రాహ్మణుల సంక్షేమం ఇక బీసీ సంక్షేమ శాఖ చూడటం అనేది ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌ను మొదటి సారిగా ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు.. విధివిధానాల ఖరారులో కీలకంగా వ్యవహరించింది మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు. ఆయన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అన్నీ ఆలోచించి..  దేవాదాయ శాఖ కిందకు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఉంచారని ఇప్పుడు బీసీ సంక్షేమం కిందకు తేవడం వల్ల బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుందన్నారు.




అయితే కొంత మంది మాత్రం ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ ను చేర్చడమే అభ్యంతరం అని కానీ ఆ నిర్ణయం ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన వారికి సాయం కోసం అని అంటున్నారు. ఐవైఆర్ కృష్ణారావుతో కలిసి ఆలయాల పరిరక్షణ కోసం ఓ సంస్థను పెట్టి నిర్వహిస్తున్న డోగిపర్తి సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కార్పొరేషన్ విషయంలో ఐవైఆర్ అభిప్రాయంతో విబేధించారు. https://m.facebook.com/story.php?story_fbid=1502835540064833&id=100010152031099


Also Read: AP News: హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకు షాక్.. ఉచిత వసతి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు


మొత్తంగా ప్రభుత్వం ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో  బయటకు తెలియకుండా తీసుకుంటోంది. ఫలితంగా ప్రజల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. బీసీ సంక్షేమ శాఖ అంటే బీసీలకు సాయంచేయడానికే అనేది అందరికీ తెలిసిన నిజం. ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్‌కు బీసీ సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తే అది కూడా వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. ఈ నిర్ణయం ముందు ముందు మరిన్ని చిక్కులను విమర్శలను ప్రభుత్వానికి తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 


Also Read: CM Jagan Review: మద్యం నియంత్రణకే రేట్లు పెంపు... ఎస్ఈబీపై సీఎం జగన్ రివ్యూ... ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి