ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్‌సీపీ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిప్పులు చెరిగారు. ఏపీలో దాష్టీక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దాష్టీకాలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆయన ఈ మేరకు వీడియో రూపంలో సందేశాన్ని విడుదల చేశారు. పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడిందని అన్నారు. నామినేషన్‌ ప్రక్రియ మొదలు కౌంటింగ్‌ వరకు వైఎస్సార్‌సీపీ అరాచకాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూసిందని మండిపడ్డారు. తమకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్‌ ఎన్నికల్లో బలంగా పోరాడి 25.2 శాతం ఓట్లు సాధించామని పేర్కొన్నారు. 


Also Read: AP CM Jagan : ఢిల్లీ టూర్‌కు జగన్ కూడా !? మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో పాల్గొనే అవకాశం !


విజయ ప్రస్థానం మొదలైంది..
పంచాయతీ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు పవన్ అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు తనకు చాలా ఆనందం కలిగించాయని పేర్కొన్నారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుతో మొదలైందని ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో వైఎస్సార్‌సీపీ పాలన ఉందని విమర్శించారు. పరిషత్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థులపై దాడులు చేసి బెదిరింపులకు దిగారని ఆరోపించారు. వారి దాష్టీకాలను చూసి ఓపిక నశించిందని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనపై క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమని ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేసి.. ప్రజల పక్షాన నిలబడతామని పవన్ హామీ ఇచ్చారు.






Also Read: AP News: హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకు షాక్.. ఉచిత వసతి రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు


Also Read: CM Jagan Review: మద్యం నియంత్రణకే రేట్లు పెంపు... ఎస్ఈబీపై సీఎం జగన్ రివ్యూ... ఇసుకను ఎక్కువ రేట్లకు అమ్మితే చర్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి