విజయవాడ కనక దుర్గమ్మ దేవాలయానికి దసరా ఉత్సవాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులతో కూడిన లైట్లను అమర్చారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం "ఫేక్" ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ప్రకటించింది. వర్జినల్ ఫోటోను.. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్న ఫోటోను రెండింటిని "ఫ్యాక్ట్ చెక్ " సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


 






Also Read : జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టెండర్లు.. టీటీడీ బోర్డు మీటింగ్ లోని నిర్ణయాలివే..


దుర్గమ్మ ఆలయానికి సంబంధించి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న ఫోటోలు పెద్ద ఎత్తున ఫ్యాక్ట్ చెక్ కోసం నెటిజన్లు తమ దృష్టికి తీసుకు వచ్చారని ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. దుర్గా మాత కృపతో నిజం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుందని ఫ్యాక్ట్ చెక్ టీం పోస్ట్ చేసింది. 


 






Also Read: Dussehra 2021: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..



ఇలాంటి ఫోటోలు సర్క్యూలేట్ అవుతున్నప్పుడు సోర్స్ వీడియోలతో కలిపి చెక్ చేసుకోవాలని ఫ్యాక్ట్ చెక్ సూచిస్తోంది. అలా చెక్ చేసి..  వీడియో నుంచి తీసిన స్క్రీన్ షాట్‌ను ఫ్యాక్ట్ చెక్ తరపున సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న లైట్లకు.. సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలకు అసలు పోలిక లేదని స్పష్టం చేశారు.


Also Read: Navaratri Festival: నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ రంగు వస్త్రం సమర్పించాలి...ఏ ప్రసాదం నివేదించాలి



సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ప్రచారం అంశానికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేకంగా ఫ్యాక్ట్‌ చెక్‌ వెబ్‌సైట్‌, ట్విట్టర్‌ అకౌంట్‌ రూపొందించారు. ఫేక్ ప్రచారాలు జరిగితే ఆధారాలతో సహా ఏపీ ఫ్యాక్ట్‌ చెక్‌ వేదికగా నిజాలు  వెల్లడిస్తున్నారు. గతంలోనూ కొన్ని ప్రత్యేకమైన ఫ్యాక్ట్ పోస్టులను పెట్టారు. 





Also Read : ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాలనుకునే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈ తేదీలోగా ఆప్షన్లు ఇవ్వండి


 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.