PM Modi 20 Years: మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తి.. ప్రధానికి శుభాకాంక్షల వెల్లువ

ABP Desam   |  Murali Krishna   |  11 Oct 2021 11:49 AM (IST)

ప్రజాజీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు.

మోదీ ప్రజాప్రస్థానానికి 20 ఏళ్లు

ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ప్రభుత్వాధినేతగా మోదీ నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు ప్రధానికి అభినందనలు తెలిపారు. ఈ 20 ఏళ్ల ప్రజా జీవితంలో మోదీ 7 ఏళ్లు ప్రధానిగా ఉన్నారు.

ఈ సందర్భంగా భాజపా నేతలు సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పరిపాలనలో ప్రధాని మోదీ తీసుకువచ్చిన సంస్కరణలపై అవగాహన, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందరికీ అభివృద్ధి అనే మంత్రంతో భారత్‌ను ప్రపంచలో మేటి శక్తిగా మార్చారని ప్రధానిని పలువురు అభినందించారు. 'ఆత్మనిర్భర్ భారత్‌'తో దేశం మరింత ముందుకు సాగుతుందని ఆకాంక్షించారు.

20 ఏళ్ల ప్రజా జీవితంలో పేదల కోసం మోదీ ఎంతో కృషి చేశారు. చాలా అసాధ్యాలను కృషి, పట్టుదలతో ఆయన సుసాధ్యం చేశారు. ఈ ప్రజాప్రస్థానానికి మోదీకి నా శుభాకాంక్షలు.                                        - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ప్రభుత్వాధినేతగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ప్రధానికి నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ 20 ఏళ్లలో ప్రతిక్షణం ప్రజాసంక్షేమం కోసమే మోదీ ఆలోచించారు. ఆయన చరిష్మా పెరుగుతూనే ఉంది.  -                                          రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి

[quote author=మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి]2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ.. దేశానికే ఓ సరికొత్త అభివద్ధి మంత్రాన్ని పరిచయం చేశారు. ప్రజల జీవితాలను మార్చారు.                                          

Also Read: ఎస్‌బీఐలో 2056 పీఓ జాబ్స్.. నోటిఫికేష‌న్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at: 07 Oct 2021 04:26 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.