Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాల ప్రభావంతో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.


ఏపీ వెదర్ అప్‌డేట్స్..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి తీవ్రత తగ్గుతోంది.






దక్షిణ కోస్తాంద్రలో నేడు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. రాయలసీమలో చలి తీవ్రత కాస్త అధికంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు సీమలోనే నమోదయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీలు, అనంతపురంలో 16.6 డిగ్రీలు, కర్నూలులో 18 డిగ్రీలు, నంద్యాలలో 18.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోస్తాంధ్రలో జంగమేశ్వరపురంలో 17.2 డిగ్రీలు, బాపట్లలో 19 డిగ్రీలు, నందిగామలో 19.1 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రాష్ట్రంలో వాతావరణం గత కొద్ది రోజుల నుంచి పొడిగా ఉంది. ఉత్తర, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న చల్ల గాలుల ప్రభావం ఉన్నా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో వడగండ్లు, రాళ్ల వాన కురిసింది. రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, ములుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. 
Also Read: Bank Holidays January 2022: జనవరిలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే ఇబ్బంది ఉండదు
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్‌ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్‌!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి