శ్రీకాకుళం జిల్లాలో ఆచారాలకు సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. పండగలు అంతరిస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆచారాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పండగలకు కొత్త బట్టలు, సినిమాలు ఆట పాటలే కాదు. అంతకు మించి అంటున్నారు ఇక్కడి పల్లె జనం. 


సంక్రాంతి టైంలో చనిపోయిన పెద్దలను గౌరవించుకోవడం ఇక్కడ ఉన్న సంప్రదాయాల్లో ఒకటి. వారి కోసం కొత్త బట్టలు కొంటారు. వారిని స్మరించుకొని తమను చల్లగా చూసేలా దీవించాలని కోరుకుంటారు. వారికి ఇష్టమైన వంటకాలు తయారు చేసి పెడతారు. 


Alsor Read: మెగా ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే... సంక్రాంతి రోజు అఫీషియ‌ల్‌గా చెప్పారుగా!


ఇన్ని చేసిన జనం... చనిపోయిన కుటుంబ సభ్యులు వస్తారో రారో ఎలా తెలుస్తుంది. అందుకే ఓ పురాతన సంప్రదాయాన్ని పాటిస్తారు సిక్కోలు వాసులు. సంక్రాంతికి వారం రోజుల ముందు జంగాలతో పెద్దలను పిలిచే ఆచారం ఉంది. 



జంగాలు ఇంటింటికీ తిరుగుతూ గంటలను ఆడిస్తూ చనిపోయిన పెద్దల పేర్లు పిలుస్తూ వచ్చి బిడ్డలను ఆశీర్వదించాలని కోరతారు. వాళ్లు పెట్టే పిండివంటలు, వస్త్రాలు తీసుకోవాలని ఆహ్వానిస్తారు. జిల్లాలో సుమారు చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి పద్దతి కనిపిస్తుంటుంది. 


Also Read: నాలుగేళ్లు మంచం మీదే.. వ్యాక్సిన్ ఇవ్వగానే లేచి కూర్చున్నాడు ! టీకాలో ఎవరికీ తెలియని శక్తి ఉందా?


సంక్రాంతి టైంలో పెద్దలను ఆహ్వానించే జంగాలకు ప్రజలకు తమ తోచిన రీతిలో సత్కరించుకుంటారు. కొందరు బట్టలు పెడతారు. మరికొందరు ధాన్యాలు, కూరగాయలు ఇస్తారు. ఇంకొన్నిచోట్ల డబ్బులు కూడా ఇస్తారు. ఈ జంగాలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. కొన్నిచోట్ల సిద్దులు అంటారు. మరికొన్ని చోట్ల జంగాలు అంటారు. 


ఇలాంటి ఆచారాలు శ్రీకాకుళం జిల్లాలో చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా పండగల టైంలో ఎక్కువ చూడొచ్చు. ప్రత్యేక వంటకాలు కూడా రుచి చూడొచ్చు. సంక్రాంతి సందర్భంగా అన్ని కూరగాయలు కలిసి కలగాయకూరను వండుతుంటారు. ఈ సీజన్‌లో దొరికే కూరగాయలతో ఈ వంటకాన్ని తయారు చేస్తారు. ఇది కూడా శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి స్పెషల్ అన్నమాట. 


Also Read: సంక్రాంతి అనగానే మహానగరాల నుంచి పల్లెబాట పడతారెందుకు...
Also Read:  అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...
Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
Also Read:  మకర సంక్రాంతి రోజు సూర్యుడి ఆశీర్వాదం కావాలంటే ఇలా చేయకుండా ఉంటే చాలు...
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...