తెలుగువాళ్ల పెద్ద పండుగ సంక్రాంతి రోజున మెగా ఫ్యాన్స్‌కు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే. అయితే... న్యూస్ గురించి ముందు నుంచి ఫీలర్లు రావడంతో వాళ్లు కూడా అఫీషియల్‌గా వార్తను వినడానికి రెడీ అయ్యారు. దాంతో ప్రిపేర్డ్‌గా ఉన్నారని చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా 'ఆచార్య'. కొరటాల శివ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే నటించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఇప్పటికీ విడుదల కాలేదు. పలు విడుదల తేదీలు ఆలోచించిన తర్వాత... ఈ ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేస్తామని వెల్లడించింది. అయితే... ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టకుని విడుదల వాయిదా వేశారు.
'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్' వాయిదా పడిన తర్వాత 'ఆచార్య' సినిమా కూడా వాయిదా పడుతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పుడు ఆ సమచారాన్ని నిజం చేస్తూ... ఫిబ్రవరి 4న ఆచార్యను విడుదల చేయడం లేదని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టకుని తమ చిత్రాన్ని విడుదల చేయడం లేదని పేర్కొంది. కొత్త విడుదల తేదీని త్వరలో వెల్లడిస్తామని తెలియజేసింది.
కుదిరితే మార్చిలో... లేదంటే ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని 'ఆచార్య' టీమ్ భావిస్తోందని ఫిల్మ్ నగర్ టాక్. ఆల్రెడీ విడుదల తేదీలు ప్రకటించిన సినిమాలు కూడా అనుకున్న సమయానికి రాకపోవచ్చని ఇండస్ట్రీ ఖబర్. కొన్ని సినిమాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట. ఆచార్య రాకపోవడవంతో ఆ తేదీకి 'శేఖర్' సినిమాను విడుదల చేయాలని రాజశేఖర్, జీవితా రాజశేఖర్ ప్లాన్ చేస్తున్నారు. అన్నట్టు... ఫిబ్రవరి 4న రాజశేఖర్ పుట్టినరోజు కూడా!
Also Read: 'హీరో' మూవీ రివ్యూ: మహేష్ బాబు మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే...
Also Read: ఐదు రోజులుగా క్వారంటైన్‌లో... కరోనా బారిన మరో సెలబ్రిటీ?
Also Read: 'బంగార్రాజు' మూవీ రివ్యూ: నాగ్ vs చైతు.. బంగార్రాజులు అదరగొట్టారా?
Also Read: రౌడీ బాయ్స్ రివ్యూ: యూత్‌ని మెప్పించే రౌడీ బాయ్స్..
Also Read: 'సూపర్ మచ్చి' రివ్యూ: సూపర్ అనేలా ఉందా? లేదా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి