Top 5 Telugu Headlines Today 31 July 2023:
బీజేపీ ఎంపీ బాపురావుపై భగ్గుమంటున్న లంబాడీలు- ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కిషన్ రెడ్డి
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలంటూ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన కామెంట్స కలకలం రేపుతున్నాయి. దీనిపై లంబాడాలు భగ్గుమంటున్నారు. ఆయన వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వస్తున్న వ్యతిరేకతను గమనించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీనిపైల క్లారిటీ ఇచ్చారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఎంపీ బాపురావు చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని అన్నారు. పార్టీకి సంబంధం లేదని చెప్పారు. పూర్తి వివరాలు
మాజీ మంత్రి నారాయణపై వేధింపుల కేసు- హైదరాబాద్‌లో ఫైల్ చేసిన తమ్ముడి భార్య
ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన సోదరుడు సుబ్రమణ్యంపై తమ్ముడు భార్య కృష్ణ ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీళ్లిద్దరు తనను మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని చర్యలు తీసుకోవాలని అందులో వేడుకున్నాడు. ఆదివారం రాయదుర్గం పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆమె వీళ్లిద్దరిపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తాను గచ్చిబౌలిలోని మీనాక్షి బ్యాంబూస్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నట్టు తెలిపారు. తనకు ఈ మధ్య క్యాన్సర్ వచ్చిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలు
ఏపీ ప్రభుత్వంపై సర్పంచ్‌ల సంఘం పోరుబాట- కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు చలో ఢిల్లీ కార్యక్రమం
ఏపీ ప్రభుత్వంపై సర్పంచ్‌ల సంఘం పోరు మొదలు పెట్టింది. నిధులు స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తున్నారు సర్పంచ్‌లు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల నిధులు దొంగిలించడంపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సర్పంచుల సంఘం, పంచాయితీ రాజ్ ఛాంబర్ నిర్ణయించాయి. ఈ మేరకు ఆగష్టు రెండో తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్‌ల ఆధ్వర్యంలో ఇతర రాజకీయ పార్టీలకు చెందిన సర్పంచ్‌లను కూడా కలుపుకొని కార్యక్రమం చేపడతారు. పూర్తి వివరాలు
నాసాలో ఉద్యోగం సాధించిన గుంటూరు కుర్రాడు- చాలా మందికి స్ఫూర్తినిచ్చే సక్సెస్ స్టోరీ !
నాసా లో ఉద్యోగం సాధించడం అంటే అంత తెలికైన విషయం కాదు. నాసాలో ఎలాగైనా ఉద్యోగం సాధించాలని ఎంతో మంది కలలు కంటూ ఉంటారు. కానీ దానికి ఎంతో పట్టుదల, కృషి ఉండాలి. కానీ అది అందరి వల్ల కాదు. కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. ఇలాంటి ఎంతో ఉన్నతి స్థాయి సంస్ధలో తెలుగుబ్బాయి అది కూడా గుంటూరు కుర్రాడు ఉద్యోగం సాధించి చూపించాడు. పూర్తి వివరాలు
'గ్రూప్-2' పరీక్ష తేదీల్లో మార్పుల్లేవ్! షెడ్యూలు ప్రకారమే పరీక్షల నిర్వహణ
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఆగస్టు 29,30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనుంది. అయితే గ్రూప్-3 పరీక్ష తేదీల ఖరారుతోపాటు గ్రూప్-1 మెయిన్స్, కళాశాల లెక్చరర్లు, సంక్షేమ వసతిగృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో), డివిజినల్ అకౌంట్స్ అధికారుల (డీఏవో) పరీక్షల నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు 'గ్రూప్-2' పరీక్షను వాయిదా వేయాలని కమిషన్‌ను ఆశ్రయిస్తున్నారు. పూర్తి వివరాలు