Top 5 Telugu Headlines Today 19 June 2023:
ఏపీ అక్రమ అప్పులపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న ఏపీ బీజేపీ - పొత్తులపై పవన్‌తో చర్చిస్తామన్న పురందేశ్వరి
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో త్వరలో భేటీ అవుతానని ఏపీబీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. వస్తున్న ఆదాయంలో నలభై శాతం వడ్డీలకే కడుతున్నారని.. లెక్కల్లో చూపకుండా అప్పులు తెచ్చి వృధా చేస్తున్నారని మండిపడ్డారు. పొత్తుల అంశంపై కేంద్ర పార్టీదే తుది నిర్ణయం అని స్పష్టం చేశారు. ఏపీలోని ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆర్థికపరమైన వ్యవహరాల్లో కేంద్రం ఏపీని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉందని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు
రాజా సింగ్ తో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల భేటీ
భారతీయ జనతా పార్టీ సస్పెండ్ చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తో బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసి చాలా కాలం అయింది. వివాదాస్పద వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయడంతో బీజేపీ హైకమాండ్ ఆయనను సస్పెండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో విడుదల అయ్యారు. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని తర్వాత తెలంగాణ బీజేపీ శాఖ కూడా హైకమాండ్‌కు సిఫారసు చేసింది. కానీ హైకమాండ్ మాత్రం నిర్ణయం తీసుకోలేదు. పూర్తి వివరాలు
119 నియోజకవర్గాల్లో ఈఆర్ఓలు, డీఈఓలను నియమించిన ఈసీ
2023 తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Elections 2023) ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగనున్నాయి. ఇప్పటికే పార్టీలు రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయాయి. ఇప్పుడు అధికారులు కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. అక్టోబర్ మొదటి పక్షంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఈక్రమంలోనే భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్‌ఓ), జిల్లా ఎన్నికల అధికారుల (డీఈఓ)లను నియమించింది. ఈ అధికారులు ఓటర్ల జాబితాల నిర్వహణ, ఖచ్చితమైన ఓటరు నమోదును నిర్ధారించడం.. అలాగే ఎన్నికల డేటా సమగ్రతను కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపింది. పూర్తి వివరాలు
బెజవాడలో సీట్ల పంపిణీ ఫిక్స్ అయిందా!
బెజవాడలో మూడు అసెంబ్లీ స్థానానాలు ఉన్నాయి. తాజాగా పవన్ చేసిన కామెంట్స్‌తో మూడు సీట్లను మూడు పార్టీలు పంచుకోవాలని ఫిక్స్ అయినట్లుగా భావిస్తున్నారు. ఇందు కోసం అవసరమైతే సెంట్రల్ నియోజకవర్గ సీటుకు బదులుగా తూర్పు నియోజకవర్గ సీట్‌ను తెలుగు దేశం సర్దుబాటు చేసుకునేందుకు రెడీ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం జనసేన కర్చీఫ్ వేసిందని టాక్. సెంట్రల్ నియోజకవర్గ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలు
రేవంత్ రెడ్డిపై బీసీ అస్త్రం - కించపరుస్తున్నారని ఉద్యమం చేయాలని బీఆర్ఎస్ బీసీ నేతల నిర్ణయం !
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీ నేతలను కించ పరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీసీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు. బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని నేతలు అభిప్రాయానికి వచ్చారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు