తెలుగు సినిమా పరిశ్రమలో పలువురు హీరోయిన్లు వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల మదిలో ప్లేస్ సంపాదించుకున్నారు. పూజా హెగ్డే, రష్మిక మందన్న, సమంతా రూత్ ప్రభు, కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, త్రిష టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ, వారికి నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల పోటీలోకి కొత్త హీరోయిన్లు రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ టాప్ ప్లేస్ నుంచి సమంత, రష్మిక అవుట్!
గత కొద్ది సంవత్సరాలుగా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ జోష్ మీదున్న సమంత ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో సినిమాలకు విరామం ప్రకటించింది. మరోవైపు కాజల్ కు పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు రావడం లేదు. రష్మిక మందన్న ఇటీవలే బాలీవుడ్ మీద బాగా ఫోకస్ పెట్టింది. తెలుగు సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అనుష్క, తమన్నా, త్రిష కొంత కాలంగా టాలీవుడ్ లో కనిపించడం లేదు.
అగ్రస్థానం కోసం శ్రీలీల, మృణాల్ పోటీ
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది శ్రీలీల. ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‘ధమాకా’ సినిమాతో ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. టాలీవుడ్ లో అరడజను సినిమాలకు పైగానే ఆమో చేతిలో ఉన్నాయి. చిన్న హీరోలతోనే కాకుండా స్టార్ హీరోల పక్కన కూడా ఛాన్స్ లు కొట్టేస్తుంది. ఇప్పటికే బాలకృష్ణ మూవీ ‘NBK108’లో ఛాన్స్ కొట్టేసింది. ఈ మధ్యనే షూటింగ్ లో కూడా పాల్గొంది. మహేష్ బాబు తాజా చిత్రం ‘గుంటూరు కారం’లోనూ నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా శ్రీలల నటిస్తోందని తెలుస్తోంది. ఇలా పెద్ద హీరోలతోనే కాకుండా నితిన్, విజయ్ దేవరకొండ, రామ్ లాంటి హీరోల సరసన కూడా జతకడుతోంది శ్రీలీల.
గత ఏడాది విడుదలైన ‘సీతారామం‘ సినిమాతో పాన్ ఇండియా రేంజిలో విజయాన్ని అందుకుంది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేరకొండతో కలిసి #VD13లో నటిస్తోంది. నేచురల్ స్టార్ నానితో కలిసి ‘హాయ్ నాన్న‘లో స్ర్కీన్ షేర్ చేసుకుంటుంది. త్వరలో బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా శ్రీలీల, మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ టాప్ గ్లామర్ క్వీన్స్‌గా వెలిగిపోవాలని నిశ్చయించుకున్నారు. టాప్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు.
Read Also: అమెరికాలో అడుగు పెట్టిన ‘బాహుబలి’ బ్రదర్స్, శాన్ డియాగోలో ఇక రచ్చే!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial