BRS BC Meet :   తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి బీసీ నేతలను కించ పరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేతలంతా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి బీసీలను  కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేశారు.  బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో  బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా  కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందని నేతలు అభిప్రాయానికి వచ్చారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. 


బీసీలందరం ఏకమవుతున్నాం : తలసాని 


రాష్ట్రంలో బీసీలమందరం ఏకమవుతున్నామని .. ఎ‍క్కువగా మాట్లాడితే తెలంగాణ గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలను తిరగనివ్వమని  కాంగ్రెస్ నేతలకు తలసాని వార్నింగ్ ఇచ్చారు.  నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అన్నీ బీసీ కులాల నాయకులను పిలిపించి చర్చిస్తాం. బీసీ నేతలై వ్యక్తిగత దాడులు చేస్తే ఊరుకునే ప్రస్తకే లేదు. బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేస్తాం. కుల వృత్తుల సమస్యలు, బాధలు మాకు తెలుసు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నాం. బాడీషేమింగ్‌ చేస్తే బాగోదు. హైదరాబాద్‌ నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఆత్మగౌరవ భవనాలు నిర్మించాం. రైతు బంధు, రైతు బీమా మెజారిటీ బీసీలకు అందుతోంది. కాంగ్రెస్ పార్టీ విధానమా.. సొంత ఎజెండనా అర్ధం కావడం లేదు. బీసీలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీ పార్టీ విధానం కదా చెప్పాలి. గ్రామల్లో కాంగ్రెస్ నాయకులను తిరగకుండా చేస్తాం. ప్రజలకు సేవా చేయాలనీ చిన్న సమాజం నుంచి వచ్చిన నాయకులం మేము. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇలాంటి మాటలు నేర్పిందా? అని ప్రశ్నించారు.  


పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకుని విమర్శలు  :  శ్రీనివాస్ గౌడ్ 


బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టుకునీ టార్గెట్ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.  బీసీలలో ఎలా పంచాయతీ పెట్టాలని కొంతమంది ప్లాన్ చేస్తున్నారని..  
మా ఓట్ల తో గెలిచి..మమ్మాల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.  భవిష్యత్ కార్యాచరణ ను తొందరలో ప్రకటిస్తామన్నారు.  కులాల వారీగా మీటింగ్‌లు పెడతామని ప్రకటించారు.  బీసీలను కించ పరిచిన  వారు.. ముక్కు నేలకు రాసి , చెంపలు వేసుకుంటే తప్పా వారిని వదలబోమని ప్రకటించారు.  కాంగ్రెస్ విధానాలను ఎండగడతాం... గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ బీసీల పై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.  బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంత మంది నాయకులు మాట్లాడుతున్నారన్నారు. బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.  సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకు పోతుంటే అక్రోషం తో బీసీలపై మాట్లాడుతున్నారన్నారు. 


త్వరలో  కార్యాచరణ


కాంగ్రెస్ పార్టీతో తాడోపేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో సమావేశం అయ్యారు.  గంగుల కమలాకర్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్,  ఎమ్మెల్సీలు మధుసూదనా చారి, యోగ్గె మల్లేశం, బసవరాజ్ సారయ్య, శాసనసభ్యులు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠాగోపాల్, గంపా గోవర్ధన్, MP లు బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర లతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల చైర్మన్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు  హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా రేవంత్ ను టార్గెట్ చేసేందుకు బీసీ నేతలకు  హైకమాండ్ టాస్క్ ఇచ్చిందని చెబుతున్నారు.